Delhi: అతడు తీహార్ జైలు( Tihar jail)లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. ఇటీవల పెరోల్‌పై బయటకు వెళ్లి తిరిగివచ్చాడు. వచ్చిన 3 రోజుల తర్వాత అతడికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయం వెలుగుచూసింది. అతడి కడుపులో 4 సెల్‌ఫోన్స్ ఉన్నాయి. వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి రెండు మొబైల్ ఫోన్లు బయటకు తీయగా, మరో రెండు మొబైల్స్ ఇంకా లోపలే ఉన్నాయి. ఓవరాల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. వివిధ నేరాల కింద ఓ ఖైదీ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల అతడు పెరోల్‌పై బయటకు వెళ్లాడు. అప్పుడే అతడికి జైల్లో డబ్బు సంపాదించాలనే ఆశ పుట్టింది. ఈ క్రమంలో ఇతర ఖైదీలకు విక్రయించాలని భావించి.. 5 సెం.మీ కంటే తక్కువ నిడివి ఉన్న 4 మొబైల్ ఫోన్‌లను మింగేశాడు. తిరిగి అతడు జైలుకు వచ్చినప్పుడు ఖైదీ సెల్‌ఫోన్లు మింగిన విషయాన్ని సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో తన ప్లాన్ వర్కువుట్ అయ్యిందని భావించాడు. ఈ క్రమంలో లోనికి వెళ్లిన తర్వాత.. ఆ సెల్‌ఫోన్లను బయటకు తీసేందుకు 2-3 రోజులపాటు విశ్వప్రయత్నం చేసి.. విఫలమయ్యాడు.
చివరకి అతడికి కడుపులో నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ప్రాణభయంతో అతడు విషయాన్ని అధికారులకు చెప్పాడు. కానీ ఎవ్వరూ అతడిని నమ్మలేదు. కామెడీ చేస్తున్నావా అంటూ సీరియస్ అయ్యారు. నొప్పితో అతడు విలవిల్లాడుతూ ఉండటంతో.. వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎండోస్కోపీ చేసి, అతని కడుపులో ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు ఉన్నాయని గ్రహించారు. బుధవారం శస్త్రచికిత్స చేసి.. 2 సెల్ ఫోన్లను రిమూవ్ చేశారు. మిగిలిన రెండు ఫోన్‌లు పొత్తికడుపుకు చేరుకున్న క్రమంలో.. స్పెషలిస్ట్ టీమ్ మరో సర్జరీ చేయనుందని తీహార్ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ తెలిపారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..