Spider Man Pushpa: రారా సామి పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్..

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఎక్కడ విన్నా.. పుష్పరాజ్ డైలాగ్స్ లేదంటే..

Spider Man Pushpa: రారా సామి పాటకు స్పైడర్ మ్యాన్ స్టెప్పులు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్..
Saami Saami Song

Updated on: Jan 08, 2022 | 3:28 PM

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఎక్కడ విన్నా.. పుష్పరాజ్ డైలాగ్స్ లేదంటే.. పుష్ప సాంగ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప సినిమా.. డిసెంబర్ 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం సౌత్‏లోనే కాకుండా.. నార్త్‏లోనూ పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  ఈ సినిమాలో సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు.  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అలరిస్తోంది.

కేవలం పుష్ప సినిమా మాత్రమే కాకుండా.. ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. దాక్కో దాక్కో మేక.. రారా సామి.. ఊ అంటావా మావా.. ఊహు అంటావా పాటలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక రారా సామి పాటకు సోషల్ మీడియాలో చిన్నా, పెద్ద తేడా లేకుండా స్టెప్పులేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు. రష్మిక వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ పాటకు స్పైడర్ మ్యాన్ ఫిదా అయ్యారు.. రారా సామీ అంటూ స్పైడర్ మ్యాన్ చేస్తున్న డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రిస్మస్ సెలబ్రెషన్స్‏లో స్పైడర్ మ్యాన్ గెటప్ వేసిన ఓ వ్యక్తి రారా సామి పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. ఎదురుగా ఉన్నవారు అతడితోపాటు స్టెప్పులేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట్లో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..