Trending: అమ్మో.. నిమ్మ అన్నట్లు ఉంది పరిస్థితి. సమ్మర్ సీజన్‌లో నిమ్మకాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న కాయలైతే… పది రూపాయలకు రెండు కాయలే ఇస్తున్నారు. పెద్ద కాయలైతే.. ఒక్కోటి 10 రూపాయలు చెప్తున్నారు. ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు కొనేందుకు జంకుతున్నారు. మండే ఎండల్లో.. చల్లని నిమ్మరసం కూడా తాగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గడిచిన రెండు వేసవుల్లో కోవిడ్(coronavirus) దెబ్బకు ఎగుమతులు లేక నిమ్మకాయల అమ్మకాల జోరు తగ్గినా… ఈ ఏడాది సమ్మర్ ఆరంభంలోనే నింగిని తాకుతున్నాయి. ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరగడంతోపాటు ఎండలు మండుతుండడం ధరల పెరుగుదలకు కారణమన్నది వ్యాపారుల వెర్షన్. ఇదిలా ఉండగా… పెరుగుతున్న నిమ్మకాయల ధరలను నియంత్రించాలని వారణాసి(varanasi)లోని ఆదిశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేతబడి కేంద్రంగా ఈ ఆలయానికి పేరుంది. పూజ సందర్భంగా అమ్మవారిని శాంతింపజేయడానికి 11 నిమ్మకాయలను బలి ఇచ్చారు. పూజను నిర్వహించిన హరీష్ మిశ్రా మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే శక్తి ‘తంత్ర పూజ’కు ఉందని, నిమ్మకాయల ధరలు రెండ్రోజుల్లో తగ్గుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు