
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అనేక చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో బ్రెయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలు ఆకట్టుకుంటూ ఉంటాయి. జనాలు కూడా టైం దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని గణిత చిత్రాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చాలా మంది లెక్కల పరిజ్ఞానాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఒక వైరల్ చిత్రమే ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీన్ని మీరు సాల్వ్ చేయగలరా ట్రై చేయండి.
వైరల్ ఫజిల్ చిత్రంలో ఏముంది
బ్రేక్ ది సిలోస్ అనే ఇన్‌స్ట్రా అకౌంట్‌లో షేర్ చేయబడిన చిత్రం ఒక గణిత ప్రశ్నను మీ ముందు ఉంచింది. ఇక్కడ సవాలు ఏమిటంటే ఎన్ని 1 + 4 = 5, 2 + 5 = 12, 3 + 6 = 21, 8 + 11 = ఎంత అవుతుందో మీరు కనుగొనాల్సి ఉంటుంది. ఇది కాస్తా కష్టమే అనిపించిన.. కాస్తా ఆలోచిస్తే దీన్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు.
సమాధానం కనుగొన్నారా?
మీరు ఈ గమ్మత్తైన గణనను పరిష్కరించారా అయితే మీరు తెలివైన వాళ్లు అని అర్థం. ఒక వేళ మీరు దాన్ని సాల్వ్ చేయలేకపోయినా ఏం పర్లేదు. దానికి సమాధానం మేం చెబుతాం. 1 + 4 = 5, 2 + 5 = 12, 3 + 6 = 21, 8 + 11 = ఎంత అనే ప్రశ్నకు సమాధానం 96 అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.