Video: జపనీస్‌ తెలుగుబ్బాయి.. ఫుడ్‌ రివ్యూ అదరగొట్టేశాడు! వీడియో చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే!

జపాన్‌కు చెందిన ఓ కుర్రాడు తెలుగులో మాట్లాడుతూ జపాన్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ రివ్యూ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన సోషల్ మీడియా సరిహద్దులు చెరిపేసి, ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్‌కు వేదికైంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Video: జపనీస్‌ తెలుగుబ్బాయి.. ఫుడ్‌ రివ్యూ అదరగొట్టేశాడు! వీడియో చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే!
Japanese Boy Telugu

Updated on: Dec 30, 2025 | 8:51 PM

సాధారణంగా సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ టైమ్‌లో కడుపుబ్బా నవ్వించాలంటే రీల్స్‌, షార్ట్స్‌తోనే అవుతుంది. అయితే సోషల్‌ మీడియా యూజర్లను ఆకట్టకునేందుకు కంటెంట్‌ క్రియేటర్లు డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఐడియాలో కంటెంట్‌ చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో సరిహద్దులన్ని చెరిపేసి.. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది.

దీంతో చాలా మంది భారీ జనాభా ఉంటే మన దేశంలోని పలు భాషల్లో కూడా వీడియోలు చేస్తూ మన నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఒక వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అందులో జపాన్‌కు చెందిన ఓ కుర్రాడు ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ జపాన్‌లోని ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో ఫుడ్‌ తింటూ రివ్యూ ఇచ్చాడు. వీడియో చూస్తే భలే ఫన్నీగా ఉంది. కింద ఉన్న వీడియో మీరు కూడా చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి