ఎన్నో ఆశ్చర్యాలకు, అద్భుతాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల చిత్ర విశేషాలు ఏం జరిగినా కూడా క్షణాల్లో మనకి తెలిసిపోతాయి. ఇక మనల్ని అబ్బురపరిచేందుకు లెక్కలేనన్ని పజిల్స్, ఛాలెంజ్స్ ఎన్నో సామాజిక మాధ్యమాల్లో తరచూ పలకరిస్తాయి. అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
Who’s here??? Try finding
PC @ryancragun pic.twitter.com/r342uw6GVs
— Sudha Ramen ?? (@SudhaRamenIFS) July 13, 2021
పైన పేర్కొన్న ఫోటోలో మంచు చిరుత ఎక్కడ దాగుందో కనిపెట్టండి అంటూ నెటిజన్లకు ఓ పజిల్ ఇచ్చారు భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్. ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఓ చిరుత దాగుని ఉండగా.. దానిని కనిపెట్టడం జనాలకు పెద్ద సవాల్‌గా మారింది. రాళ్ల రంగు, దాని రంగు ఒకేలా ఉండటంతో.. ఆ చిరుతను గుర్తించడంలో నెటిజన్లు ఫెయిల్ అవుతున్నారు. ఒకరు కూడా మంచు చిరుతను సరిగ్గా గుర్తించలేకపోయారు. కొంతమంది అయితే ఈ ఫోటో చిరుత ఉన్నట్లు భ్రమ కల్పిస్తోందని కామెంట్స్ చేశారు. ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు ఈ ఫోటోలో మంచు చిరుతను కనుగొంటారా.? లేదా.? ట్రై చేయండి.
— Manoj Prabakar S (@imanojprabakar) July 13, 2021