Viral News: గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

పాము పేరు వింటే చాలు చాలామంది భయపడతారు. దాన్ని దూరం నుంచి చూసినా కొంతమందికి గుండె ఝల్లుమంటుంది....

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

Updated on: May 20, 2021 | 4:32 PM

Snake Swallowing Another Snake: పాము పేరు వింటే చాలు చాలామంది భయపడతారు. దాన్ని దూరం నుంచి చూసినా కొంతమందికి గుండె ఝల్లుమంటుంది. ఇదిలా ఉంటే సాధారణంగా పాములు… కప్పలు, ఇతర క్రిమికీటకాదులను ఆహారంగా తీసుకుంటాయి. కానీ, పామును పామే మింగటం ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే. ఇక్కడ పామును మరో పాము సజీవంగా మింగేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చూస్తున్నారుగా.. ఇక్కడ ఓ భారీ సర్పం మరో పామును అమాంతం మింగేస్తోంది. ఈ దృశ్యాలను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ వైభవ్ సింగ్ తన కెమెరాలో బంధించారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాల్‌చల్ చేస్తోంది. దానిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

కాగా, అడవులను నరికి ఇతర ప్రాణులకు నిలువనీడ లేకుండా చేస్తున్నారు. దీంతో జనావాసాల్లోకి జంతువులు రావటం, వాటిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం సహజం అయిపోయింది. అలా అడవుల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాములు తలదాచుకోవడానికి జనావాసాలకు వస్తున్నాయి. తరచూ ఏదో ఒకచోట పాములు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.

ఇవి చదవండి:

పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

 ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!

Loading...
Unable to load recommendations.
Follow Us