విషపూరితమైన ప్రాణిగా భావించే పాములు ఇటీవల కాలంలో తరచూ జనావాసాల్లోకి చేరి హల్‌చల్ చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అందరినీ భయపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ పాము ఒకరి ఇంట్లోని ఫ్రిజ్‌లో దూరింది. ఒక్కసారిగా ఫ్రిజ్‌లో కనిపించిన పామును చూసిన ఆ ఇంటి సభ్యులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
అసలే ఎండాకాలం..భానుడి ప్రతాపంతో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యతాపాన్ని తట్టుకోలేక జనజీవనం అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి, ఉక్కపోతను భరించలేక మనుషులు ఫ్రీజ్‌లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అయితే, నోరులేని జీవులు ఏం చేస్తాయి. అందుకే కాబోలు.. ఈ పాము భలే ఐడియా చేసింది. ఫ్రిజ్‌లో దూరి డీ ఫ్రీజ్‌లో మకాం పెట్టింది. కర్ణాటకలోని శివమొగ్గ నగర సహ్యాద్రి నగర లేఔట్ మూడో క్రాస్‌లో ఉన్న ఓ ఇంట్లో ఫ్రిజ్‌లో పాము కనిపించింది. శంకర్ అనే వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉల్లిగడ్డల ట్రేలో పాము ఉండడంతో స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికిచేరుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ సురక్షితంగా పామును పట్టి సమీపం అడవిలో వదిలిపెట్టాడు. దాంతో అందరూ పీల్చుకున్నారు.