గాఢ నిద్రలో ఉన్న యువకుడి ఒంటిపై వింత గుర్తులు.. చూసి షాకైన కుటుంబీకులు.. అసలేం జరిగిందంటే..

మంచంపై నిద్రపోతున్న ఓ యువకుడు నిద్రలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. రాత్రి ప్రశాంతంగా పడుకుని నిద్రపోయిన అతడు.. తెల్లవారేసరికి విగత జీవిగా పడివుండటం చూసిన కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మరణించాడని వైద్యులు వెల్లడించారు. మృతుడి ఒంటిపై పది చోట్ల కొన్ని వింత గుర్తులు ఉండటం కనిపించింది. అదేంటని పరిశీలించగా పాము కాటుగా గుర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే...

గాఢ నిద్రలో ఉన్న యువకుడి ఒంటిపై వింత గుర్తులు.. చూసి షాకైన కుటుంబీకులు.. అసలేం జరిగిందంటే..
Snake Bit

Updated on: Apr 14, 2025 | 6:07 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బహసుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామంలో 25 ఏళ్ల యువకుడు నిద్రలోనే మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. అతని మరణం వెనుక రహాస్యం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆ యువకుడి శరీరం మీ పది చోట్ల భోజనానంతరం అతను అలసట కారణంగా మంచం మీద అలాగే పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. అంతే..ఆ రాత్రి అతనికి చివరి రాత్రిగా మారింది. అతని మంచంపై చేరిన విష సర్పం అతడి జీవితాన్ని కబళించేస్తుందని అతినికే కాదు. ఎవరికీ తెలియదు.

ఇక ఆ మర్నాడు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు అతనిని నిద్ర లేపడానికి దగ్గరకు వెళ్లారు. మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్న మిక్కీ కింద ఒక బతికి ఉన్న పాము బుసలు కొడుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేశారు. వెంటనే చుట్టుపక్కల ప్రజలు గుమిగూడారు. గ్రామంలో గందరగోళం చెలరేగింది. గాఢ నిద్రలో ఉన్న అతన్ని పాము కాటు వేయగానే విషం అతని శరీరమంతా వ్యాపించింది. దాంతో అతను నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. మిక్కీ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఆ పామును సజీవంగా పట్టుకున్నారు. వెంటనే వైద్యుడిని కూడా పిలిచారు. కానీ అప్పటికి మిక్కీ చనిపోయాడు. అమిత్ చేతులు, కాళ్ళు, శరీరంపై 10 వేర్వేరు ప్రదేశాల్లో గాట్లున్నాయని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రాత్రంతా పాము మిక్కీ మృతదేహం కింద ఎలా ఉంది… అది ఎందుకు బయటకు రాలేదో తెలియక పోలీసులు, గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మిక్కీ వివాహితుడు, భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. అతను తన నలుగురు సోదరులలో రెండవవాడు. అతని ఆకస్మిక మరణం కారణంగా కుటుంబం మొత్తం షాక్‌లో ఉంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. అందరూ ఈ విషాద సంఘటనను గురించి చర్చించుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..