Viral Video: సాధారణంగా పాములంటే అందరికి భయమే. పెద్దల నుంచి చిన్నారుల వరకు పాములంటే వణికిపోతుంటారు. కానీ అన్ని పాములు కూడా విషపూరితమైనవి కావు. అయినప్పటికీ పాములకు దూరంగానే ఉంటారు. సాధారణంగా పాములు తన ఆకలిని తీర్చుకునేందుకు రకరకాల కీటకాలు, చిన్న చిన్న పక్షులను సైతం తింటుంటాయి. ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని పాములు తన సామర్థ్యం కంటే ఎక్కువ రేట్లలో ఆహారం తింటుంటాయి.
అయితే పాములు గుడ్లను కూడా తింటుంటాయి. పెద్ద సైజులో ఉండే గుడ్లను పాము నిజంగానే తింటుందా..? అంత పెద్ద సైజు ఉన్న గుడ్డు ఎలా తింటుందనే అనుమానాలు రావచ్చు. ఆకలితో ఉన్న పాములు పెద్ద పెద్ద గుడ్లను సైతం తినేస్తుంటాయి. అలాంటి వీడియోలు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఆకలితో ఉన్న ఓ పాము ముందుగా అటు ఇటు తచ్చాడుతూ.. కొద్దిసేపటి తర్వాత ఓ భారీ గుడ్డును తినేందుకు రెడీ అయిపోయింది. ఆ భారీ గుడ్డును అమాంతంగా మింగేసింది. ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే వేల మంది చూసేశారు. ఈ వీడినయోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే చిన్న చిన్న పాములు తన ఆకలిని తీర్చుకునేందుకు ఎంతకైనా సాహసం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం.
Snake preying on eggs pic.twitter.com/kcHPT53WR8
— Life and nature (@afaf66551) June 3, 2021