Viral Video: మరదళ్ల మజాకా..! కొత్తపెళ్లికొడుక్కి చుక్కలు చూపించారు.. పాపం వరుడు సిగ్గుతో ఇలా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి మండపంలోకి వధువు ప్రవేశించిన వెంటనే..వరుడు ఆమెకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా కిందకు దిగి వచ్చాడు.. పెళ్లికూతురు చేయి పట్టుకుని

Viral Video: మరదళ్ల మజాకా..! కొత్తపెళ్లికొడుక్కి చుక్కలు చూపించారు.. పాపం వరుడు సిగ్గుతో ఇలా..
Marriage 1
Image Credit source: Representative Image

Updated on: Aug 23, 2022 | 4:11 PM

Viral Video:  ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి.. వీటిలో వధూవరులతో పాటు వివిధ రకాల వివాహాలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వచ్చింది. అది కూడా చాలా వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో… అప్పటికే వరుడు జయమాల కోసం వేదికపై కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. కొంత సమయం తరువాత వధువు ఎంట్రీ ఇస్తుంది.. వరుడు ఆమెను ఎత్తుకోవడానికి వేదికపై నుండి కిందకు వస్తాడు. అయితే వధువు చెల్లెల్లు వరుడిని ఆటపట్టించే పనిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి మండపంలోకి వధువు ప్రవేశించిన వెంటనే..వరుడు ఆమెకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా కిందకు దిగి వచ్చాడు.. పెళ్లికూతురు చేయి పట్టుకుని వేదికపైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే, పెళ్లికూతురు వెంటనే ఉన్న ఆమె అక్కా చెల్లెలు.. పెళ్లికొడుక్కి షాక్‌ ఇచ్చారు. వరుడు వధువు చేతిని పదే పదే పట్టుకోవాలని ప్రయత్నించిన్పటికీ వారు అతన్ని అడ్డుకోవటం వీడియోలో కనిపిస్తుంది. పాపం వధువుకి షేక్‌ హ్యాండ్‌ ఇద్దామని ఎంతప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

మరదళ్లు చేసిన ఈ చర్యపై వరుడు సిగ్గుపడుతున్నట్లు వీడియో చివర్లో మీరు చూస్తారు. కొంత సరదా తర్వాత జయమాల కార్యక్రమం ముగుస్తుంది. పెళ్లికి సంబంధించిన ఈ వీడియో royal_kathiyawadi_couple అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి