Watch Video: షాపింగ్‌ మాల్‌లో షాకింగ్‌ సీన్..! అమాంతం మహిళను మింగేసిన భూమి..! భయానక వీడియో వైరల్‌..

|

Apr 01, 2024 | 1:50 PM

ఒక షాపింగ్‌ మాల్‌లో హఠాత్తుగా నేల కుంగిపోయి ఒక మహిళను మింగేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఓ షాపింగ్ మాల్‌లో చోటుచేసుకుంది. ఈ మహిళ షాపింగ్ కోసం అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరగబోతోందో తెలియక తీరికగా అక్కడ నడుస్తూ షాపింగ్‌ చేస్తోంది. అంతలోనే అక్కడ ఊహించని సంఘటనతో ఆమె ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Watch Video: షాపింగ్‌ మాల్‌లో షాకింగ్‌ సీన్..!  అమాంతం మహిళను మింగేసిన భూమి..!  భయానక వీడియో వైరల్‌..
Chinese Woman Swallowed
Follow us on

సోషల్ మీడియా అంటేనే వైరల్‌ వీడియోలకు అడ్డా.. ఇక్కడ వింత, విచిత్ర సంఘటనలకు సంబంధించి అనేక విషయాలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని భయానకమైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అలాంటి ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులోని దృశ్యం నిజంగానే వణుకుపుట్టించేలా కనిపించింది. కాళ్ల కింది నేల ఒక్కసారిగా కుంగిపోతే ఏం జరుగుతుంది..సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక షాపింగ్‌ మాల్‌లో హఠాత్తుగా నేల కుంగిపోయి ఒక మహిళను మింగేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఓ షాపింగ్ మాల్‌లో చోటుచేసుకుంది. ఈ మహిళ షాపింగ్ కోసం అక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరగబోతోందో తెలియక తీరికగా అక్కడ నడుస్తూ షాపింగ్‌ చేస్తోంది. అంతలోనే అక్కడ ఊహించని సంఘటనతో ఆమె ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మీడియా కథనాల ప్రకారం, ఈ సంఘటన తూర్పు చైనాలో జరిగింది. మార్చి 23న ఈ ఘటన చోటుచేసుకుందని, అక్కడ అమర్చిన సెక్యూరిటీ కెమెరాల్లో అన్నీ రికార్డయ్యాయని News.au నివేదించింది. మహిళతో పాటు, మాల్‌లోని చాలా వస్తువులు కూడా భూమిలోకి పడిపోయాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఇక్కడ పనిచేస్తున్న ఒక నిర్మాణ కార్మికుడు కూడా శిథిలాల కింద చిక్కుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సెఫ్టీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద పడ్డ భవన నిర్మాణ కార్మికుడు, షాపింగ్‌ కోసం వచ్చి భూమిలో కూరుకుపోయిన ఆ మహిళకు ఫ్రాక్చర్ అయింది. గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.

ఇవి కూడా చదవండి

అయితే, నేల కూలడానికి గోడ దెబ్బతినడమే కారణమని మాల్ మేనేజర్ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే బాద్యత తమదేనని చెప్పారు. అయితే భవనం కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇది సాధారణ సంఘటననా, లేదా భవనం నిర్మాణం, నిర్వహణలో ప్రధాన భద్రతా లోపాలకు సంకేతమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..