Viral Video: పోస్టల్ సిబ్బంది లోడింగ్ చేస్తుండగా కదులుతూ కనిపించిన పార్శిల్.. అనుమానంతో ఓపెన్ చేయగా షాక్

|

Jun 30, 2022 | 6:49 PM

పోస్టల్ సిబ్బంది చిరునామాల ఆధారంగా పార్శిల్స్ అన్నింటిని డివైడ్ చేస్తుండగా.. ఓ పార్శిల్ బాక్స్ కదులుతూ కనిపించింది. దీంతో షాకైన వర్కర్క్ దాన్ని ఓపెన్ చేయగా ఒక్కసారిగా కంగుతిన్నారు.

Viral Video: పోస్టల్ సిబ్బంది లోడింగ్ చేస్తుండగా కదులుతూ కనిపించిన పార్శిల్.. అనుమానంతో ఓపెన్ చేయగా షాక్
Postal Workers Shocked
Follow us on

Trending Video: ఈశాన్య థాయ్‌లాండ్‌(north-east Thailand)లోని ఖోన్ కెన్ ప్రావిన్స్‌(Khon Kaen province)లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. పోస్టల్‌ ఉద్యోగులు పార్శిల్స్‌ను లోడింగ్ చేస్తుండగా.. ఒక బాక్స్ కదులుతూ కనిపించింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ బాక్స్‌ను పరిశీలించగా సూర్యరశ్మి తగలనివ్వొద్దు అని రాసి ఉంది. అంతేకాదు.. బాక్స్ రెండు వైపులా 2 రంధ్రాలు ఉన్నాయి. దీంతో అనుమానంతో అక్కడ వర్కర్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా లోపల నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఆపై పరీక్షగా చూడగా లోపల భారీ కింగ్ కోబ్రా కనిపించింది. ఒక్కసారిగా కంగుతిన్న తపాలా ఉద్యోగులు వెంటనే స్థానిక జంతు రక్షక బృందానికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి బాక్స్ తెరిచి 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు. నేషనల్ పార్క్ వన్యప్రాణుల రేంజర్‌లు ఆ పామును తమతో పాటు తీసుకెళ్లారు. ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది.. ఆ పార్శిల్ ఎవరికైతో వచ్చిందో అతడిని పిలిచి విచారించారు. అందులో పాము ఉన్నట్లు అతను ఒప్పుకున్నాడు. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప తాము కస్టమర్ల పార్శిల్స్ ఓపెన్ చేయమని అక్కడి సిబ్బంది తెలిపారు. ఎటువంటి జీవులను పోస్ట్ ద్వారా డెలివరీ చేయకూడదని వెల్లడించారు. వాతావరణం కారణంగా మొక్కలు దెబ్బతినే అవకాశం ఉన్నందున.. వాటిని రవాణా చేయడానికి కూడా తాము అంగీకరించమని తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, తాజాగా సదరు పామును పంపిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు కల్నల్ ప్రీచా కెంగ్‌సారికిట్ తెలిపారు. పోస్ట్ ద్వారా పామును పంపడం.. ఆ పాముకి.. ఆ పార్శిల్ డెలివరీ చేసే వ్యక్తులకు ఎంతో ప్రమాదం అని పేర్కొన్నారు.