సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని షాకింగ్ గా ఉంటే.. మరికొన్ని క్యూట్ గా.. ఇంకొన్ని అయితే భయానకంగా ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇందులో ఓ వ్యక్తి తనను తాను షార్క్ నుంచి కాపాడుకోవడానికి గట్టిగా పోరాడతాడు. తీక్షణంగా గమనిస్తే అతడు చేపలు పట్టుకునేందుకు వల వేయగా.. ఆ వల చివర ఉన్న వస్తువు కోసం సొరచేప వెంటపడుతుంది. ఇక ఆ షార్క్ నుంచి తప్పించుకునేందుకు అతడు శతవిధాల ప్రయత్నించాడు. ఒకానొక సందర్భంలో పడవ బోల్తా కొడుతోంది. ఆ వ్యక్తి నీటి అడుగున షార్క్ తో సుమారు 20 నిమిషాల పాటు చాకచక్యంగా పోరాడతాడు. ఏది ఏమైనా చివరికి ఆ వ్యక్తి ఫిషింగ్ రోడ్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఒకింత షాక్ కు గురి కావడంతో పాటు వరుసగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read more: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..
CM KCR: రోజాను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..
హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈ ఆదివారం మాంసం దుకాణాల బంద్.. కారణం అదేనా..?