ఆ మహిళ పేరు వివియన్ గోమెజ్.. ఈ ఆదివారం ఉదయం నిద్ర లేచి తన కెమెరాలో ఏముందో చూసేసరికి ఓ అద్భుత విచిత్ర దృశ్యం కనబడి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. చిన్న పిల్లాడో, ఏలియనో , పొట్టి మనిషో తెలియదు గానీ ఓ తెల్లని ఆకారం తన ఇంటి ఫ్రంట్ డోర్ నుంచి కొద్ది దూరం అదోరకంగా నడుస్తూ… ఇట్టే మాయమైంది. ఒకటికి పదిసార్లు చూసినా అదే సీన్ ! ఈ అరుదైన దృశ్యం తాలూకు వీడియోను ఆమె తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఎవరైనా ఇలాంటి విచిత్ర జీవిని చూశారా అని ప్రశ్నించింది. ఆమెకు తన రెండు సెక్యూరిటీ కెమెరాల్లోనూ ఇదే సీన్ కనబడిందట. ఆన్ లైన్ లో ఈ వీడియో వైరల్ అయింది. ఫేస్ బుక్ లో 90 లక్షల వ్యూస్ వస్తే టన్నుల కొద్దీ కామెంట్లు వచ్చిపడ్డాయి. ట్విటర్ లోనూ రీ-పోస్ట్ అయింది. అది చూసిన దాదాపు మూడు కోట్ల మందిలో బాప్ రే అనని వాళ్ళు లేరు. కొందరు.. ఈ వింత జీవి హారీ పోటర్ యూనివర్స్ లోని మ్యాజికల్ హౌస్ డాబీతో పోల్చారు. మరికొందరు ఈ ఎల్ ఎఫ్, లేదా గాబ్లిన్ (విచిత్ర ప్రాణి) అయి ఉండవచ్ఛునని అభిప్రాయపడ్డారు. ఇంకొంతమంది ఇది ఫేక్ అని, ఫోటోషాప్ చేశారని పెదవి విరిచారు. అయితే గామేజ్ మాత్రం వీటిని ఖండిస్తూ.. ఇందులో ఎలాంటి ఫేక్ లేదని, ఫోటోషాప్ చేయడంగానీ, ట్రిక్ ఫొటోగ్రఫీ గానీ లేదని తన కామెంట్ పోస్ట్ చేసింది. ఏమైనా.. ఈ వింత ఎక్కడ జరిగినా కెమెరా ‘ కళ్ళు ‘ మనల్ని మోసం చేస్తాయా అని అంటున్నవాళ్ళు చాలామందే ఉన్నారు.
a lady posted this and said she saw this on her home camera this morning. what y’all think this is ? pic.twitter.com/L98wckn6bO
— jey bee . ? (@jadynbee_) June 7, 2019