Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్.. సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో మనం నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు..

Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్..  సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..
Bird

Updated on: Jul 30, 2021 | 10:19 PM

Viral Video: సోషల్ మీడియాలో మనం నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే నెట్టింట్లో కోకొల్లలుగా సందడి చేస్తుంటాయి. ఆ వీడియోల్లో పక్షులు, జంతువులు చేసే అల్లరి చూస్తుంటే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా ఓ పక్షికి(సీగల్) సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో అది చేసిన పని చేసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అమ్మో.. దొంగ అంటూ దానిపై ఫన్నీ సెటైర్లు పేల్చుతున్నారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ పక్షి సైలెంట్‌గా బేకరీ షాప్‌లోకి ప్రవేశించింది. అలా నడుచుకుంటూ వస్తున్న ఆ పక్షిని కొందరు వీడియో తీశారు. అదేమీ పట్టనట్లుగా ఉన్న పక్షి నేరుగా షాపులోకి ఎంటరవుతుంది. స్నాక్స్ కౌంటర్‌కు వెళ్తుంది. అక్కడ అందుబాటులో ఉన్న చిప్స్ ప్యాకెట్‌ను నోట కరుచుకుని అంతే సైలెంట్‌గా బయటకు వెళ్లిపోతుంది. కాగా, షాపు లోపలికి వచ్చిన పక్షి కోసం షాపు బయట మరో పక్షి ఎదురు చూస్తూ ఉంది. అంతలో ఇది చిప్స్ ప్యాకెట్ పట్టుకుని బయటకు వెళ్లగా.. రెండు కూలిసి వెళ్లిపోయాయి. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్.. బ్యూటెంజీబీడెన్ షోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘సైలెంట్ పని కానిచ్చేయండి.. ఎవరూ గమనించరు..’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షల మంది నెటిజన్లు వీక్షించగా.. 20 వేల లైక్స్, 4 వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ పక్షి దొంగతనంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..

Husband Kills Wife: ఆవేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. కడదాకా తోడుంటామంటూనే కడతేరుస్తున్నారు.. ఎందుకిలా..?

Follow Us