Watch Funny Video: హోం వర్క్‌ ఎగ్గొట్టడానికి ఈ పిల్లోడి నాటకాలు చూశారా? దెయ్యం పట్టేసిందట.. వీడియో వైరల్

ఇంట్లో పిల్లలతో హోం వర్క్‌ చేయించడం పేరెంట్స్‌కి ఓ పెద్ద టాస్కే. ఎలాగైనా హోం వర్క్‌ ఎగ్గొట్టాలని వీళ్లు చేసే యాక్షన్ల ముందు సినీ హీరోలు కూడా దిగదుడుపే. తాజాగా ఓ పిల్లోడు హోం వర్క్‌ చేయకుండా స్కూల్‌కి వెళ్లాడు. టీచర్‌ ఆ గడుగ్గాయిని నిలబెట్టి హోం వర్క్‌ ఎందుకు చేయలేదని అడిగాడు..! అంతే.. సదరు విద్యార్ధి నట విశ్వరూపం చూసి స్కూళ్లో టీచర్లంతా నోరెళ్లబెట్టారు..

Watch Funny Video: హోం వర్క్‌ ఎగ్గొట్టడానికి ఈ పిల్లోడి నాటకాలు చూశారా? దెయ్యం పట్టేసిందట.. వీడియో వైరల్
School Student Hilarious Ghost Act

Updated on: Aug 18, 2025 | 6:41 PM

స్కూల్‌ పిల్లల అల్లరి అంతా ఇంతా ఉండదు. కాసేపు కూడా కుదురుగా కూర్చుని పుస్తకం ఓ పట్టాన పట్టరు. ఇక వాళ్లతో హోం వర్క్‌ చేయించడం ఇంట్లో పేరెంట్స్‌కి ఓ పెద్ద టాస్కే. ఎలాగైనా హోం వర్క్‌ ఎగ్గొట్టాలని వీళ్లు చేసే యాక్షన్ల ముందు సినీ హీరోలు కూడా దిగదుడుపే. తాజాగా ఓ పిల్లోడు హోం వర్క్‌ చేయకుండా స్కూల్‌కి వెళ్లాడు. టీచర్‌ ఆ గడుగ్గాయిని నిలబెట్టి హోం వర్క్‌ ఎందుకు చేయలేదని అడిగాడు..! అంతే.. సదరు విద్యార్ధి నట విశ్వరూపం చూసి స్కూళ్లో టీచర్లంతా నోరెళ్లబెట్టారు. సాధారణంగా పిల్లలు ఇలాంటి సందర్భాల్లో కడుపు నొప్పని, జ్వరం అని చిన్న చిన్న అబద్ధాలు ఏవో చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. మరికొందరు ముదుర్లైతే ఏకంగా ఇంట్లో నానమ్మ, తాతయ్య ఎవరో ఒకరు చనిపోయారంటూ బతికుండగానే పాడికట్టేస్తారు. అయితే ఈ పిల్లాడు అంతకుమించి అన్నట్లు దెయ్యం పూనినట్లు క్లాస్‌ రూంలో యమ యాక్షన్‌ చేశాడులే.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

డైలీ గురు అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో కన్నడ మీడియం ప్రభుత్వ పాఠశాలలో కుర్చీపై కూర్చున్న ఓ పిల్లాడు కనిపిస్తాడు. పిల్లాడి దగ్గరికి ఓ ఉపాధ్యాయుడు వచ్చి హోంవర్క్ ఎందుకు చేయలేదని అడుగుతాడు. హోంవర్క్ అనే మాట వినగానే.. పిల్లాడు దెయ్యం తనపైకి వచ్చినట్లు నటించడం ప్రారంభిస్తాడు. హోంవర్క్ ఎందుకు చేయలేదని టీచర్‌ అడగగానే.. కళ్ళు మూసుకుని ‘మీ నాన్నని అడుక్కో..’ అని సమాధానం చెప్పాడు. తొలుత అసలు విషయం అర్ధంకాని టీచర్‌.. విద్యార్ధి ట్యాలెంట్‌ని గుర్తించి తాను కూడా వరుస ప్రశ్నలు అడగటం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

వెంటనే ఎవరి నాన్నని అడగాలి అని టీచర్ ప్రశ్నించారు. వెంటనే పిల్లాడు ‘నేను ఇక్కడికి వచ్చి ఆ బాలుడి తండ్రిని అడిగాను’ అని చెప్పడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత బాలుడు ‘నేను వెంటనే వెళ్ళాలి’ అని టీచర్‌తో చెబుతాడు. ఆ తర్వాత టీచర్‌ ‘నువ్వు సినిమాలో నటించావా? నీ పేరు ఏమిటి?’ వంటి ప్రశ్నలు అడగ్గా.. బాలుడు అదే ధోరణిలో ‘అతన్ని పిలిచి అడగండి’ అని అన్నాడు. టీచర్ ఎవరిని అడగాలి అని ప్రశ్నించగా.. ‘అతని తండ్రిని పిలిచి అడగండి’ అని బాలుడు సమాధానం చెప్పడం వీడియోలో చూడొచ్చు.’నేను ఇక్కడ లేను. ఈ బాలుడి తండ్రిని అడగండి. అతనికి తెలుస్తుంది. నా పేరు ఏంటి అని అడిగితే నేను చెప్పను. నేను అతని ఇంటికి కాపలాగా వచ్చాను అని కళ్లుమూసుకుని అర్ధంలేని మాటలు మాట్లాడుతాడు. అక్కడే ఉన్న ఓ లేడీ టీచర్‌ వచ్చి ఎవరిని పిలవాలి అని అడిగినప్పుడు, అతని తండ్రికి ఫోన్ చేయి. నా దగ్గరకు వచ్చిన అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి.. అడగడండి అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. పిల్లాడి యాక్షన్‌క అక్కడి టీచర్లు పడిపడి నవ్వడం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. లక్షల వీక్షణలు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి ఐడియాలు నా చిన్నప్పుడు రాలేదే అని ఓ యూజర్‌ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇంతకీ మీరేమంటారు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.