Scary Video: కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

Komodo Dragon Scary Video: ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసరస్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ భూమండలం మొత్తం భారీ శరీరంతో..

Scary Video: కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

Updated on: Mar 06, 2021 | 6:01 PM

Komodo Dragon Scary Video: ఒకప్పుడు ఈ భూమి మీద డైనోసరస్ అనే రాకాసి బల్లులు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ భూమండలం మొత్తం భారీ శరీరంతో ఉండే ఆ రాకాసి బల్లులు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవని పరిశోధకులు కూడా నిర్ధారించారు. వాటి ఉనికి నిరూపించే ఎన్నో ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా పరిశోధనలు చేసి రాకాసి బల్లుల ఉనికి నిజమే అని చెప్పారు. అయితే కాలక్రమంలో భూ వాతావరణంలో వచ్చిన మార్పులు, తుఫాన్‌లు, భూకంపాల కారణంగా ఈ రాకాసి బల్లులు చాలా వరకు అంతరించిపోయాయి.

ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో సంచరిస్తున్న ఈ రాకాసి బల్లులను మోనిటర్ లిజార్డ్స్ అంటారు. అలాగే ఇవి చాలా బలంగా ఉండటంతో పాటు భారీ శరీరం కలిగి ఉంటాయి. వీటి నాలుక పొడవుగా ఉంటుంది. వీటి లాలాజలంలో ఇరవై రకాల బాక్టీరియాలు ఉండటం వలన లాలాజలం చాలా విషపూరితంగా ఉంటుంది. ఇదిలావుంటే.. ఈ రాకాసి బల్లి జాతికి చెందిన కొమాడో డ్రాగన్ వేటాడటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే తప్పకుండా షాక్‌ అవుతారు. ఇందులో ఓ కోతి కొమాడో డ్రాగన్‌తో పోట్లాటకు దిగింది. ఈ భయంకర పోరాటంలో చివరికి ఆ రాకాసి బల్లి.. కోతిని మింగేసింది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి…

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!

Loading...
Unable to load recommendations.
Follow Us