
ఒక వ్యక్తికి ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. నైట్ డిన్నర్‌లో చికెన్ తిన్న తర్వాత అతడికి కడుపులో నొప్పి మరింతగా పెరిగింది. దాంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడికి పరీక్షించిన వైద్యులు CT స్కాన్ కూడా చేశారు. స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్ అంతా షాక్ అయ్యారు. అతడికి వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బాధితుడి స్కానింగ్ రిపోర్ట్ చూసిన వైద్యులు మొదట అతని కడుపులో కోడి ఎముక ఇరుక్కుపోయి ఉండవచ్చని భావించారు. కానీ, తరువాత అసలు నిజం తెలిసింది. ఇంతకీ అతనికి ఏం జరిగిందో పూర్తి డిటెల్స్‌లోకి వెళితే…
29 ఏళ్ల వ్యక్తి రోజంతా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ, ఆ సమస్యకు కారణమేమిటో తనకు తెలియదని చెప్పాడు. కడుపు దిగువ భాగంలో నొప్పి ఎక్కువగా ఉందని చెప్పాడు. ఎలాంటి ఆహారం తిన్నావని డాక్టర్స్ అడుగగా, నైట్ డిన్నర్‌లో చికెన్ తిన్నానని చెప్పాడు. ఆ తరువాతే నొప్పి మరింతగా పెరిగిందని చెప్పాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతన్ని CT స్కాన్ కోసం పంపారు. అందులో 3.7 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఒక చిన్న వస్తువు కనిపించింది. అతను అనుకోకుండా ఆహారంలో ఎముక మింగేసి ఉంటాడని వైద్యులు ఊహించారు.
ఆ తరువాత డాక్టర్స్ అతనికి అత్యవసర లాపరోస్కోపీ చేశారు. అప్పుడు వారికి అసలు కారణం ఏంటో తెలిసింది. అతడి కడుపు నొప్పికి కారణం కోడి ఎముక కాదు, చెక్క టూత్‌పిక్ అని గుర్తించారు. వెంటనే సర్జరీ చేసిన వైద్యులు దానిని పేగు నుండి తొలగించగలిగారు. అదృష్టవశాత్తూ ఆ టూత్‌పిక్ అతని పేగులలో పెద్దగా నష్టం కలిగించలేదని చెప్పారు. మూడు రోజుల తరువాత వైద్యులు అతన్ని ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేశారు. కాగా, అనుకోకుండా అతను నోటిలో టూత్‌పిక్ పెట్టుకుని అలాగే నిద్రపోయినట్టుగా అతను గుర్తు చేసుకున్నాడు. తరువాత అతను నిద్రలో అనుకోకుండా దానిని మింగేశాడని గ్రహించాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..