Wedding Viral Video: వివాహ వేడుకంటే.. ఎంత హాడావుడిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఓ వైపు వరుడు కుటుంబ సభ్యులు, మరోవైపు వధువు కుటుంబ సభ్యులు.. ఇంకా బంధువులు, సన్నిహితులు.. స్నేహితులు.. వీరంతా ఉంటే.. సందడే సందడి.. అయితే… పెళ్లి వేడుకలో వరుడిని ఆట పట్టించాలంటే.. కేవలం మరదళ్లకే సొంతం. అందుకే మరదళ్లు ఉంటే ఆ పెళ్లి సందడే వేరంటరు పెద్దలు. బావ, మరదళ్ల అల్లరిలో ఎప్పుడు కూడా మరదళ్లతో పై చేయి ఉంటుంది. మరదళ్లు లేకపోతే ఆ పెళ్లి వేడుకలో సందడి ఉండదనడానికి ఈ వీడియో నిదర్శనంగా మారింది. అయితే.. ఈ వీడియోలో మరదలు పెళ్లి వరుడికి బిగ్ షాక్ ఇచ్చింది. ఏకంగా 21 లక్షలు డిమాండ్ చేసింది. ఎందుకనకుంటున్నారు.. తన బావ షూ దొంగతనం చేసి 21 లక్షల రూపాయలు ఇస్తేనే.. కదలుతారని.. లేకపోతే అడుగు కూడా ముందుకు వేయరంటూ షరతులు విధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ వరుడి కుటుంబసభ్యులతో గొడవకు దిగింది. ఈ సరదా సన్నివేశం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది.
వివాహ వేడుకలో కొన్ని సరదా ఆటలుంటాయి. దానిలో భాగంగా మరదలు వరుడి షూ దొంగతనం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరదలు తన బావ షూని దొంగిలించడానికి వెళ్లినప్పుడు, వరుడి వైపు ఉన్న వ్యక్తులు షూ దొంగతనం కాకుండా అడ్డుకుంటారు. ఈ క్రమంలో బావ బంధువులతో మరదలు గొడవకు దిగుతుంది. చాలాసేపు వాదిస్తుంది. కేవలం షూ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టవద్దు అంటూ వారందరినీ హెచ్చరిస్తుంది. వారితో గొడవపడి చివరకు వరుడి బూట్లు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత బంధువులు షూ ఇవ్వాలని అడగగా.. 21 లక్షల రూపాయలు ఇస్తేనే ఇస్తానంటూ పట్టుబడుతుంది. ఆ తర్వాత మరదలకు లక్ష వరకు ఇచ్చి షూను తీసుకుంటారు. డబ్బులివ్వడంతో మరదలు నవ్వుతూ కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వీడియో..
ఈ వీడియోలో వరుడు, వధువు కుటుంబాల మధ్య జరిగిన సరదా సన్నివేశం నవ్వులు పూయిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. ది వెడ్డింగ్ కార్ప్ అనే అకౌంట్ ద్వారా ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: