Viral Video: పిలుస్తుంటే.. నన్నే పట్టించుకోవా..? పిల్ల ఎనుగు అల్లరి చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్
Elephant Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియో నెటిజన్లను నవ్విస్తుంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి
Elephant Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియో నెటిజన్లను నవ్విస్తుంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలా వైరల్ అయ్యే వీడియోల్లో జంతువుల వీడియోలు చాలా ఉన్నాయి. కొన్ని జంతువులు చిన్న పిల్లల్లా అల్లరి చేస్తుంటాయి. వాటిని చూస్తుంటే ముద్దు ముద్దుగా సరదాగా అనిపిస్తుంది. అల్లరి చేసే జంతువుల్లో ఎనుగులు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. గజరాజుల అల్లరి చూసి అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా గున్న గజరాజుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ చిన్న ఏనుగు అల్లరి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తనను సంరక్షించే వ్యక్తిని ఎనుగు ఆట పట్టిస్తున్న వీడియో తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో.. ఏనుగు కేర్ టేకర్ పని చేసుకుంటూ ఉంటాడు. అయితే.. పిల్ల ఎనుగుకి బోర్ కొట్టి అక్కడికి వస్తుంది. తనను కేర్ టేకర్ పట్టించుకోవడం లేదనుకున్న ఎనుగు.. మావటివాడిని తొండంతో పిలుస్తుంది. అయితే కేర్ టేకర్ అదంతా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అయినా కానీ.. ఎనుగు అలానే పిలుస్తుంటుంది. చివరకు ఆ కేర్ టేకర్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ క్రమంలో దానిని సముదాయించే లోపే అది పసి పిల్లాడి లాగా.. అల్లరి చేస్తుంది. అక్కడున్న కర్రలపైన కాళ్లు వేసి మరి కేర్ టేకర్ ను లాగుతుంది.
వీడియో..
So human…..we too cling to people we love and yearn for their love and attention ❤️❤️. #love #positivity #nature #Elephant @hvgoenka pic.twitter.com/B1q91jp6Vl
— Tarana Hussain (@hussain_tarana) October 14, 2021
అయితే.. ఈ వీడియోను చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. పిల్ల ఎనుగు అందంగా అల్లరి చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
Also Read: