Watch: పైసా ఖర్చులేని 5 బర్నర్‌ గ్యాస్‌ స్టౌవ్‌.. ఈ ఆంటీ తెలివికి హాట్సాఫ్‌ చెప్పాల్సిందే..

ఇప్పుడు మార్కట్‌లో మూడు, నాలుగు బర్నర్‌ కలిగిన గ్యాస్‌ స్టౌవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఖరీదు ఎక్కువైన గానీ, కొంచెం పెద్ద కుటుంబాలకు అవసరం కాబట్టి.. ఎక్కువ మంది EMI ప్లాన్‌ చేసి కొంటుంటారు. కానీ, ఇందులో ఒక్క బర్నర్ చెడిపోయినా కూడా ఆ రోజంతా పస్తులుండాల్సిందే. కానీ, మన గ్రామ సోదరీమణులు మాత్రం మట్టి, ఇటుకలు ఉపయోగించి అద్భుతమైన గ్యాస్‌ స్టౌవ్‌ తయారు చేశారు.

Watch: పైసా ఖర్చులేని 5 బర్నర్‌ గ్యాస్‌ స్టౌవ్‌.. ఈ ఆంటీ తెలివికి హాట్సాఫ్‌ చెప్పాల్సిందే..
Eco Friendly 5 Burner Stove

Updated on: Nov 11, 2025 | 7:39 AM

ప్రస్తుతం మన దేశంలో గ్యాస్‌ స్టౌవ్‌ల వినియోగం ఎక్కువగా ఉంది. నగరాల్లో చాలా మంది ఈ గ్యాస్ స్టవ్‌ల కోసం షోరూమ్‌ల చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడు మార్కట్‌లో మూడు, నాలుగు బర్నర్‌ కలిగిన గ్యాస్‌ స్టౌవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అవి ఖరీదు ఎక్కువైన గానీ, కొంచెం పెద్ద కుటుంబాలకు అవసరం కాబట్టి.. ఎక్కువ మంది EMI ప్లాన్‌ చేసి కొంటుంటారు. కానీ, ఇందులో ఒక్క బర్నర్ చెడిపోయినా కూడా ఆ రోజంతా పస్తులుండాల్సిందే. కానీ, మన గ్రామ సోదరీమణులు మాత్రం మట్టి, ఇటుకలు ఉపయోగించి అద్భుతమైన గ్యాస్‌ స్టౌవ్‌ తయారు చేశారు. ఆమె తన మెదడును 100శాతం ఉపయోగించి, మట్టితో ఆధునిక 5-బర్నర్ స్టవ్‌ను తయారు చేసింది.

ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గ్రామీణ మహిళ 5-బర్నర్ల స్వదేశీ స్టవ్‌ను తయారు చేసింది. అది కూడా ఎటువంటి విద్యుత్ ఉపకరణాలు లేకుండా, కేవలం స్వదేశీ జుగాడ్‌ సహాయంతో చేసింది. దీనిలో ఆమె ఒక పార, ఇనుప రాడ్, వెదురు కర్రలు ఉపయోగించి చాలా స్మార్ట్‌ వర్క్‌ చేసింది. ఈ వైరల్ వీడియోను @hazratmondal02 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 54.6 మిలియన్ల వ్యూస్‌ దాటింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో, ఒక గ్రామీణ మహిళ మొదట పారతో నేలపై నాలుగు వైపులా బాక్స్‌ వేసినట్టుగా గీసింది. ఆ తరువాత, దానిలో ఒక వరుసలో ఇటుకలను పేర్చింది. ఆ తర్వాత, ఆమె దానిపై మట్టి పొరను పూసింది. ఇనుప రాడ్ ముక్కలు, వెదురు కర్రలతో 5 బర్నర్‌లను ఏర్పాటు చేసింది. చూసేందుకు బెస్ట్‌ గ్యాస్ స్టవ్ లాగా నీట్‌గా కనిపిస్తుంది. చివరగా, ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి, ఆమె ఇనుప బర్నర్‌లను ఇన్‌స్టాల్ చేసి, 5-స్టార్ దేశీ స్టవ్‌ను సిద్ధం చేసింది.

ఈ స్టవ్ ఆధునికంగా కనిపించడమే కాకుండా, ఐదు వంట పాత్రలతో ఈజీగా వంట చేసుకోవచ్చు. రోటీ, కూరగాయలు, పప్పు, టీ, హల్వా అన్నీ ఒకేసారి తయారు చేయవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చాలా మంది ఆ మహిళ చాతుర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

వీడియో ఇక్కడ చూడండి..

చాలా మంది ఆ మహిళను ప్రశంసిస్తూ, ఇది IIT కంటే మెరుగైన ఇంజనీరింగ్! అని వ్యాఖ్యానించారు, మరికొందరు, నగరంలో, మనం మైక్రోవేవ్ కోసం పోరాడుతాము, ఇదిగో మట్టి స్టవ్! ఈ సోదరికి ఆమె జుగాడ్ ఆవిష్కరణకు ఆస్కార్ ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..