స్వేచ్ఛకు అర్థం మారుతోంది. ఎవరికీ నచ్చినట్లు వారు జీవించొచ్చనే భావన చాలా మందిలో ఉంటున్నారు. అయితే పక్కన వారికి ఇబ్బంది కలగనంత వరకే స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. అలా కాదని హద్దులు మిరితీ నవ్వులపాలు కావడం ఖాయం. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్‌లోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే పై కారులో వెళ్తున్న ఓ జంట రెచ్చిపోయింది. నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి అసభ్యకరంగా ప్రవర్తించింది. కారు సన్ రూఫ్ నుంచి పైకి వచ్చిన ఓ జంట. రొమాన్స్ చేసుకుంటూ షికారు చేశారు. అందరూ చూస్తుండానే హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ కార్‌లో దూసుకుపోయారు. దీంతో దీనంతటినీ వేరే కారులో వెళ్తున్న వారు స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేశారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర అవుతున్నారు. కొందరేమో ఈ జంటకు ఎవరిష్టం వారిదంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇదేం పద్ధతి అంటూ చివాట్లు పెడుతున్నారు. అయితే తాజాగా ఇదీ అంశంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుడా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. pic.twitter.com/4PM6GDvRCc
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 16, 2023
సమాజంలో జరిగే ప్రతీ అంశంపై స్పందించే సజ్జనార్ తాజాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోపై కూడా స్పందించారు. ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..