Viral Video: రూ.200ల నోటుతో తేనె స్వచ్ఛతను పరీక్షించే విధానం.. వైరలవుతున్న వీడియో

|

Jul 10, 2023 | 4:34 PM

వైరల్‌ వీడియోలో ఒక వృద్ధుడు రోడ్డుపక్కన తేనె విక్రయిస్తున్నట్లు ఇందులో చూడవచ్చు. తేనె స్వచ్ఛమైనదని చెబుతున్నాడు. అయితే, కస్టమర్‌కు తేనె స్వచ్ఛతను చూపించడానికి, అతను మొదట రెండు వందల రూపాయల నోటును తీసుకుని, ఆ నోటులో కొంత భాగంపై కొద్దిగా తేనెను పూస్తాడు.

Viral Video: రూ.200ల నోటుతో తేనె స్వచ్ఛతను పరీక్షించే విధానం.. వైరలవుతున్న వీడియో
Honey Purity Check
Follow us on

మనం బయటి మార్కెట్లో కొనుగోలు చేసిన తేనె స్వచ్ఛంగా ఉంటుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతుంది. అయితే, తేనె స్వచ్ఛతను గుర్తించడం ఎలాగో ఎప్పుడైన తెలుసుకున్నారా..? కానీ, తేనె అమ్మేవారికి ఈ విషయంలో అవగాహన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు తేనెను విక్రయించడానికి, దాని స్వచ్ఛతను చెప్పడానికి వారి సొంత తెలివితేటలను వాడుతుంటారు. కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి తేనె స్వచ్ఛతను నిరూపించడానికి 200 రూపాయల నోటుపై తేనె వేసి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే, సోషల్ మీడియా యూజర్లు సదరు వ్యక్తి చేసిన ప్రయోగాన్ని అంగీకరించటం లేదు. కొంతమంది వినియోగదారులు ఆ తేనె పూర్తిగా నకిలీ అని చెబుతున్నారు. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది.

వైరల్‌ వీడియోలో ఒక వృద్ధుడు రోడ్డుపక్కన తేనె విక్రయిస్తున్నట్లు ఇందులో చూడవచ్చు. తేనె స్వచ్ఛమైనదని చెబుతున్నాడు. అయితే, కస్టమర్‌కు తేనె స్వచ్ఛతను చూపించడానికి, అతను మొదట రెండు వందల రూపాయల నోటును తీసుకుని, ఆ నోటులో కొంత భాగంపై కొద్దిగా తేనెను పూస్తాడు. ఆ తర్వాత అతడు అగ్గిపుల్ల వెలిగించి కరెన్సీ నోటుపై పూసిన తేనె భాగం కింద ఉంచాడు. కానీ నోటు కాలిపోదు. అంటే తేనె పూసిన నోటుకు మంటలంటుకోలేదు. అంతేకాదు.. నోటు కాలిపోతే తేనె మొత్తం పారేస్తానని సదరు వ్యక్తి చెప్పటం కూడా వీడియోలో కనిపించింది. ఆ తర్వాత కూడా అతడు..ఇదే ఫీట్‌ను రూ.10 నోటుతో కూడా చూపించాడు.

ఈ వీడియో ‘ఇండియన్ ఫుడీ’ అనే ఫేస్‌బుక్ పేజీ నుండి పోస్ట్ చేయబడింది. దాని శీర్షికలో అతను ఇలా రాశాడు..కోల్‌కతాలో 100% స్వచ్ఛమైన తేనె రుచి చూడవచ్చునని..ఇక ఈ వీడియోకి 13 వేల రీట్విట్లు, 8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. అలాగే, వందలాది మంది వినియోగదారులు దీనిపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..