Viral: ట్రైన్‌లోని జనరల్ భోగీలో అనుమానాస్పదంగా రెండు బ్యాగులు.. తెరిచి చూడగా

|

Feb 20, 2025 | 4:48 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు పెట్టినా, కొత్త చట్టాలు అమలులోకి తెచ్చినా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తమ దొంగ తెలివితేటలను ప్రదర్శిస్తూ.. పుష్పరాజ్ స్థాయిలో క్రియేటివిటీ ఐడియాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా అరక్కోణం రైల్వే స్టేషన్‌లో.. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: ట్రైన్‌లోని జనరల్ భోగీలో అనుమానాస్పదంగా రెండు బ్యాగులు.. తెరిచి చూడగా
Representative Image
Follow us on

మాదకద్రవ్యాల మత్తులో పడి యువత చిత్తవుతోంది. తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాల్సిన పోయి.. వారు ఊహ లోకంలో పయనిస్తూ.. మైకంలో తేలిపోతున్నారు. అవును సామీ.! గంజాయి మత్తులో పడి.. యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గంజాయి మత్తును కూకటివేళ్లతో పెకిలించాలని డిసైడ్ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులకు ఫుల్ పవర్స్ కూడా ఇచ్చేశాయి. తాజాగా అరక్కోణం రైల్వేస్టేషన్‌లో సుమారు 11 ప్యాకెట్లలో 22 కేజీల ఎండు గంజాయిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) పోలీసులు పట్టుకున్నారు.
చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ రోజు బుధవారం, అరక్కోణం రైల్వే స్టేషన్‌కు అప్పుడే టాటానగర్(జార్ఖండ్)- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్‌లో ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక వారికి జనరల్ కంపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పదంగా రెండు టూరిస్ట్ బ్యాగులు కనిపించాయి. వాటిని చెక్ చేయగా దెబ్బకు బిత్తరపోయారు. అందులో 11 ప్యాకెట్ల గంజాయి కనిపించింది. అది సుమారు 22 కేజీలు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ గంజాయి ఎవరిది.? ఆ బ్యాగులు ఎవరివై ఉంటుంది.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి