
రోలర్ కోస్టర్.. పై నుంచి రయ్యిమంటూ కిందకి జారిపోతూ.. మనకు తెలియకుండానే గింగిరాలు తిరుగతూ ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. రోలర్ కోస్టర్ రైడ్ అంటే చాలా మందికి భయం.. మరికొంత మందికి మహా సరదా. ఈ సరదా గేమ్ కొందరికి భయంకరమైన అనుభూతిని కలిగించింది. అయితే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ద్వారా కొందరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. జనంతో బాగా రద్దీగా ఉన్న ఓ రోలర్ కోస్టర్.. సడన్‌గా రైడ్ మధ్యలో సాంకేతిక లోపం వచ్చి ఆగిపోయింది. అంతే! అందులో ఉన్నవారంతా మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడుతూ.. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ లో కొంత మంది రోలర్ కోస్టర్ రైడ్ కు వెళ్లారు. ఈ రైడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. ఇంకేముంది రైడ్ కు వెళ్లిన వారంతా తలకిందులుగా వేలాడుతూ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏ మాత్రం పట్టుతప్పినా పై ప్రాణాలు పైకే పోయేవి. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction.
Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ— Sasha White (@rusashanews) July 4, 2023