ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిని ప్రజలు చూడటమే కాకుండా విస్తృతంగా షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో వన్యప్రాణులకు సంబంధించినదైతే అది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోల్లో మనం అడవికి సంబంధించిన విభిన్న కోణాలను చూడవచ్చు. మనం ఇంతకు ముందెన్నడూ చూడని అందాలు కనుల విందు చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ xలో షేర్ చేశారు. దీన్ని 42 వేల మందికి పైగా చూశారు. నీటి చెరువులో ఖడ్గమృగాల గుంపు సరదాగా ఎంజాయ్ చెయ్యడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో క్లిప్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. సాధారణంగా ఖడ్గమృగాలు ఒంటరిగా ఉండే జీవులు. అయితే ఈ వీడియోలో ఖడ్గమృగాలన్నీ చేరి ఒకే చోట ఆనందంగా గడుపుతున్నాయి. అరుదైన జీవులు కలయికని చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖడ్గమృగాలు నీటిలో ఉల్లాసంగా ఉండే ఈ దృశ్యాన్ని పూల్ పార్టీ అని కూడా పిలుస్తున్నారు.
A crash of rhinos; this is what a group of rhino is called as. They live solitary, except during mating or new born. Here an exceptional video of rhinos enjoying a pool party. pic.twitter.com/rT0IGVdaOp
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 1, 2023
వైరల్ అవుతున్న వీడియోలో ఖడ్గమృగాల బృందాన్ని చూడవచ్చు. వాస్తవానికి ఈ జీవులు సంభోగం సమయంలో లేదా కొత్తగా మరో ఖడ్గమృగానికి జీవం ఇచ్చే సమయంలో మినహా ఒంటరిగా జీవిస్తారు. అయితే ఇప్పుడు అడవిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది ఖడ్గమృగాలు కలిసి ఎంజాయ్ చేస్తున్నాయి. ఇది నమ్మశక్యం కానీ విషయం అని అంటున్నారు. ఈ వీడియోలో పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. ఓహ్ చాలా అందంగా ఉంది. దీన్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్ అని ఒకరు కామెంట్ చేస్తే.. ఎంత అందమైన జీవులు! తమ శరీరాన్ని తమదైన శైలిలో చల్లబరచుకోవాలో వీటిని ఖచ్చితంగా తెలుసని వ్యాఖ్యానించారు. మరొకరు దయచేసి అడవి పేరు కూడా చెప్పండని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..