Viral Video: ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతమవడం, సామాజిక మాద్యమాలు అందుబాటులోకి రావడంతో యావత్ ప్రపంచ ఒక కుగ్రామంలా మారింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ వింత దర్శనమిచ్చినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. అంతా సోషల్ మీడియా మహత్తు మరి. అందుకే.. నిత్యం అనేక రకాల వీడియోలు, ఫోటోలు, కంటెంట్‌తో సోషల్ మీడియా నిత్యం మోత మోగుతుంటుంది. తాజాగా పిల్లికి సంబంధించి ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
పురాణాలు, మత గ్రంథాల ప్రకారం ఆదిదేవుడు మహా శివుడిని ముక్కంటీశ్వరుడు అంటారు. ఎందుకంటే ఆయనకు త్రినేత్రం కూడా ఉంటుంది కాబట్టి. దాదాపు ఆయన మూడో కన్ను అన్ని వేళలా మూసి ఉంటుంది. ఒక వేళ పరమేశ్వరుడు తన మూడోకన్ను తెరిస్తే ఈ విశ్వమే అంతరించిపోతుందని హిందువుల విశ్వాసం. అయితే, పరమేశ్వరుడి తరువాత మూడో కన్ను ఓ పిల్లి కూనకు వచ్చింది. అవును, ఓ పిల్లికి మూడు కళ్లు ఉన్నాయి. కను గుడ్డు పైన మరో కనుగుడ్డు ఉంది. ఓ ఇంటి వ్యక్తి పిల్లిని సాదుతున్నారు. ఆ పిల్లికి మూడు కళ్లు ఉన్నాయి. చూడటానికి మాత్రం రెండే కనిపిస్తాయి. కుడివైపున కంటిలో రెండు కనుగుడ్లు ఉన్నాయి. ఒక కనుగుడ్డు పైన మరో కనుగుడ్డు ఉంది. ఇలా మూడో కంటిని వీడియో తీసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది. మూడు కళ్లను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..