Viral News: వేలంలోకి పురాతన కళ్లద్దాలు.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!

|

Oct 23, 2021 | 8:35 PM

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఈ మధ్యకాలంలో ప్రపంచం నలుమూలల జరిగిన వింతలూ, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..

Viral News: వేలంలోకి పురాతన కళ్లద్దాలు.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!
Spectacles
Follow us on

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఈ మధ్యకాలంలో ప్రపంచం నలుమూలల జరిగిన వింతలూ, విశేషాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వార్త తాజాగా నెట్టింట హల్చల్ చేస్తోంది. రాజుల కాలం నాటి కళ్లద్దాలు లండన్‌లో వేలానికి వచ్చాయి. వాటి ప్రత్యేకత, ధర గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అదేంటో చూద్దాం పదండి..!

లండన్‌లోని సొతెబీ వేలం సంస్థ నిర్వహించిన ఆక్షన్‌లో.. వినూత్న అద్దాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌ను ఏలిన 17వ శతాబ్దం నాటి మొఘలుల కళ్లద్దాలను నిర్వహాకులు వేలంలో ఉంచారు. 200 క్యారెట్ల వజ్రాలు, 300 క్యారెట్ల ఎమరాల్డ్స్‌ వంటి వాటితో ఈ అద్దాలను తయారు అయ్యాయి. దీంతో ఈ గాగుల్స్‌ను కొనేందుకు ఔత్సాహికులు తెగ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

దాదాపు 50 ఏళ్ల పాటు ఆ కళ్లజోడు ఓ వ్యక్తి వద్దే ఉన్నాయని సంస్థ అంటోంది. అయితే అవి ఏ యువరాజు చేయించారో.. వాటి రూపశిల్పి ఎవరన్నది మాత్రం తెలియదని పేర్కొంది. కాగా, వేలానికి ముందు ప్రజల సందర్శనార్థం తొలిసారి ఈ నెల 7 నుంచి 11 వరకు హాంకాంగ్‌లో కళ్లద్దాలను ప్రదర్శించారు. ఇక తాజాగా లండన్‌లో ప్రదర్శనలో పెట్టారు. అక్టోబర్ 26 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఆ మర్నాడే వేలం నిర్వహించనుంది. ఒక్కో దానికి సుమారు రూ.15.5 కోట్ల నుంచి రూ.25.8 కోట్ల దాకా వస్తుందని అంచనా వేస్తోంది.