Viral Video: పెళ్లి కూతురు వేషంలో కచ్చా బాదం సాంగ్ ను పాడిన రేణు మండల్.. నెట్టింట్లో వైరల్..

Viral Video: ఒక్కరోజుకే స్టార్ సింగర్ గా ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన రాను మండల్ (Ranu Mondal) తాజాగా సోషల్ మీడియా (Social Media) లో ఓ వీడియోతో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో..

Viral Video: పెళ్లి కూతురు వేషంలో కచ్చా బాదం సాంగ్ ను పాడిన రేణు మండల్.. నెట్టింట్లో వైరల్..
Ranu Mondal Sings Kacha Bad

Updated on: Apr 14, 2022 | 7:09 PM

Viral Video: ఒక్కరోజుకే స్టార్ సింగర్ గా ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన రాను మండల్ (Ranu Mondal) తాజాగా సోషల్ మీడియా (Social Media) లో ఓ వీడియోతో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో రాను పెళ్లికూతురుగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఫేస్‌బుక్ , యూట్యూబ్‌లో కనిపించినఈ వీడియోలో  రాను మండల్ ఎరుపు రంగు చీర, నగలను ధరించి అచ్చం బెంగాలీ పెళ్లి కూతురుగా రెడీ అయింది. అంతేకాదు.. బెంగాలీ బ్రైడల్ వేషంలో వైరల్ బెంగాలీ పాట కచా బాదం పాడుతూ కనిపించింది.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశెనగ విక్రేత భుబన్ బద్యాకర్ పాడిన పాట కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫేస్‌బుక్‌లోని వీడియో 9,000 కంటే ఎక్కువ లైక్‌లు, 13 వేలకు పైగా షేర్లను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ దేశ విదేశీయులను కూడా మెప్పించింది. ఇప్పటికే అనేక రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక తాజాగా రాను మండల్ పెళ్లికూతురుగా దుస్తులు ధరించి కచా బాదం పాడింది. ఈ వీడియోను ఎవరు రికార్డ్ చేశారన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించింది.

రాను మోండల్ .. ఒక్క సాంగ్ తో ఆగస్ట్ 2019లో ఓ రేంజ్ సెలబ్రెటీ హోదాను సొంతం చేసుకుంది. 1972లో ఏక్ ప్యార్ కా నగ్మా హై  పాడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. రాత్రికి రాత్రే స్టార్ హోదాను సొంతం చేసుకుంది.  వెస్ట్‌లోని రానాఘాట్ రైల్వే స్టేషన్‌లో రాను సాంగ్ పడుతున్న సమయంలో  యువ ఇంజనీర్ అయిన అతింద్ర చక్రవర్తి ఆమెను గుర్తించారు. అనంతరం రాను కి హిమేష్ రేష్మియా తన సినిమా హ్యాపీ హార్డీ అండ్ హీర్ లో పాట పడే అవకాశం ఇచ్చారు

 

Also Read: రాత్రి భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..

Viral Video: బర్త్‌ డే పార్టీలో స్నేహితుల అత్యుత్సాహం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..