కుక్క బర్త్‌డే.. సిటీ అంతా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు! విష్‌ చేసేది కుక్క ఫ్రెండ్సే.. కానీ, ఉగ్రదాడి కారణంగా..

రాంచీ నగరంలో రాగ్నార్ అనే కుక్క పుట్టినరోజును జరుపుకుంటూ, భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షించింది. శివశంకర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క రాగ్నార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ హోర్డింగులను ఏర్పాటు చేశాడు. అతను నిర్వహిస్తున్న రాగ్నార్ యానిమల్ షెల్టర్ హోమ్‌లో 60 కంటే ఎక్కువ వీధి కుక్కలు ఉన్నాయి.

కుక్క బర్త్‌డే.. సిటీ అంతా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు! విష్‌ చేసేది  కుక్క ఫ్రెండ్సే.. కానీ, ఉగ్రదాడి కారణంగా..
Dog Birthday Poster

Updated on: Apr 26, 2025 | 7:33 PM

ఏ నగరంలోనైనా వీధుల్లో భారీ హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లు కనిపిస్తాయి. రాజకీయ నాయకులను స్వాగతం పలకడానికి, పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి బ్యానర్లు, హోర్డింగ్‌లు, పోస్టర్‌లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రధాన రహదారులపై రాగ్నార్ అనే కుక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. రాజధాని రాంచీలోని వీఐపీ రోడ్లుగా పిలువబడే హర్ము బైపాస్, అర్గోరా రోడ్, ఫేస్‌బుక్ స్క్వేర్‌లలో ఉన్న హోర్డింగ్‌లు అందరి దృష్టిని ఆకర్షించాయి.

నిజానికి, ఈ హోర్డింగ్ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన రాగ్నార్ అనే కుక్క పుట్టినరోజు వేడుకలకు సంబంధించింది. అనేక ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లలో మన ప్రియమైన రాగ్నర్ భయ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసి ఉంది. మరో విశేషం ఏంటంటే.. ఆ రాగ్నర్‌ కుక్కకు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పోస్టర్‌లో మరి కొన్ని కుక్కల ఫొటోలు ఉన్నాయి. ఆ హోర్డింగ్‌లో బాబర్, అలెక్స్, కోకో, అవకాడో, సుందర్, తాత సుజిత్, కాఫీ అనే కుక్కల ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ కుక్కల తరపున రాగ్నార్ (కుక్క) కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పోస్టర్లో పేర్కొ్న్నారు.

ఈ హోర్డింగులను ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు శివ శంకర్. అతను రాంచీలోని జోన్హా ప్రాంతంలోని గుడిదిహ్ ప్రాంతంలో రాగ్నార్ యానిమల్ షెల్టర్ హోమ్‌ను నిర్వహిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అతని కేంద్రంలో 60 కి పైగా వీధి కుక్కలు ఉన్నాయి. యజమానులు వీధుల్లో వదిలివేసిన కుక్కలను శివశంకర్ దత్తత తీసుకొని తన రాగ్నార్ యానిమల్ సెంటర్ ఇంట్లో ఉంచుకుంటాడు. రాగ్నర్ అనేది శివశంకర్ పెంపుడు కుక్క, దీని పుట్టినరోజు ఈరోజు అంటే ఏప్రిల్ 26న రాగ్నర్ పుట్టినరోజును ఘనంగా చేయాలని శివశంకర్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద సంఘటన తర్వాత, ఇప్పుడు రాగ్నర్ పుట్టినరోజును సాదాసీదాగా జరుపుకోవాలని నిర్ణయించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి