దేవుడు ఉన్నాడు లేడు అనే విషయంపై ఎప్పుడూ ఆస్థికులకు, నాస్తికులకు మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై, రాముడు కృష్ణుడు దేవుళ్ళపై ఎప్పుడు ఏదొక విషయంలో చర్చ నడుస్తూనే ఉంటుంది. లంకలో ఉన్న తన భార్య సీత ను రక్షించుకోవడం కోసం సముద్రం మీద రాముడు వారధి నిర్మించాడని.. దీనిని రామ సేతు అంటరాని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం రామ సేతు బాలీవుడ్ సినిమా నేపథ్యంలో మళ్ళీ వారధి నిర్మాణం రచ్చ మొదలైంది. రామసేతు శాశ్వతమైన ప్రేమకు వారధి అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రామ సేతు సినిమా ఇటీవల విడుదలైంది. ఇందులో నాస్తికుడైన ఆర్కయాలజిస్ట్ రా అక్షయ్ నటించారు. రామ సేతు నిర్మాణం.. మూలాల గురించి అన్వేషించడం ఈ సినిమా నేపధ్యం.. తెరకెక్కిన సినిమా రామ సేతు. దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ వారధిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖ గురించి మళ్ళీ చర్చ మొదలైంది.
Ram Setu ,the bridge to eternal love unlike Taj Mahal that has been hyped a lot pic.twitter.com/sNGCIAbpnL
— Dr.SushmaShallakaul?? (@shallakaul) November 10, 2021
రామ సేతు బ్రిడ్జి పై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. రామ సేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని.. రాళ్లు వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయన్న అలెన్ లెస్టర్ చెప్పారు. అంతేకాదు రామసేతు ఇసుక 4వేల ఏళ్ల నాటిదని, రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని పరిశోధనలలో తేలిందని చెప్పారు. అంతేకాదు ఈ వారధి పై డాక్యుమెంటరీని చిత్రీకరించిన ఓ సైన్స్ ఛానల్.. ఇది సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్ గా పేర్కొన్నది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఇది మానవుల మేధస్సుకు గొప్పనిదర్శనం అని చెప్పింది సదరు ఛానల్. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ రాళ్లను ఎవరు వంతెనగా ఏర్పాటు చేశారు.. అసలు నీటి మీద రాళ్లు ఎలా తేలాయి వంటి అనేక సందేహాలకు సమాధానం మాత్రం ఇప్పటికీ మిస్టరీనే .. ప్రశ్నలు చాలా ఉన్నాయి.. కానీ సమాధానం దానికి స్పష్టమైన అధరాలు లేవు. అయితే కొన్ని సార్లు నదిలో రాళ్ళూ తేలుతూ.. వెళ్తున్నారని.. అవి రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లే అంటూ కొందరు చెబుతుంటారు.
రామసేతు వారథి గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు:
( సేకరణ)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..