Ram Mandir inauguration: అయోధ్యకు వెళ్తున్నారా..? ప్రవేశ ద్వారం వద్ద వీళ్లందరి అనుమతి తప్పనిసరి..!

|

Jan 05, 2024 | 8:21 PM

అయోధ్యలోని రామ మందిరం వెలుపల గజరాజు, హనుమంతుడు, గరుడ, సింహాం విగ్రహాలను ఏర్పాటు చేశారు. లేత గులాబీ రంగులో ఉన్న ఈ విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వీటిని తయారు చేసిన రాళ్లను రాజస్థాన్‌లోని బన్సిపహద్‌పూర్ గ్రామం నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ రాయిని ఇసుక రాయి అంటారు. ఈ ఇసుకరాతి విగ్రహం రామ మందిర సౌందర్యాన్ని పెంచింది.

Ram Mandir inauguration: అయోధ్యకు వెళ్తున్నారా..? ప్రవేశ ద్వారం వద్ద వీళ్లందరి అనుమతి తప్పనిసరి..!
Ayodhya Ram Mandir
Follow us on

జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అందుకే రామమందిరం ప్రారంభోత్సవ సన్నాహాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. 100 ఏళ్లకు పైగా రామమందిరంపై ఉన్న వివాదం ఇప్పుడు ముగిసి, రామమందిర ప్రారంభోత్సవంతో కొత్త శకం ప్రారంభం కానుంది. రామమందిరం ప్రారంభోత్సవం కోసం చాలా మంది రామభక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్రాండ్‌ రామ్‌ టెంపుల్‌ ఎలా ఉంటుందో, ఆలయ డిజైన్‌ ఎలా ఉంటుందో అనే ఆసక్తి చాలా మందిలో కలుగుతుంది. అయితే ఇప్పుడు రామమందిరానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రామ మందిర నిర్మాణంపై కొత్త సమాచారం వెలుగులోకి వస్తోంది. అలాగే రామ మందిరం ప్రవేశ ద్వారం దగ్గర గజ్, సింగ్, హనుమాన్, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ayodhya Ram Mandir

అయోధ్యలోని రామ మందిరం వెలుపల గజరాజు, హనుమంతుడు, గరుడ, సింహాం విగ్రహాలను ఏర్పాటు చేశారు. లేత గులాబీ రంగులో ఉన్న ఈ విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వీటిని తయారు చేసిన రాళ్లను రాజస్థాన్‌లోని బన్సిపహద్‌పూర్ గ్రామం నుంచి అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ రాయిని ఇసుక రాయి అంటారు. ఈ ఇసుకరాతి విగ్రహం రామ మందిర సౌందర్యాన్ని పెంచింది.

ఇవి కూడా చదవండి

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిరం, గ్రాండ్ సింహ ద్వారం ఫోటోలను షేర్ చేసింది. ఇందులో గజ, సింహ, హనుమంత, గరుడ విగ్రహాలు కనిపిస్తాయి. సింహా ద్వారాం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు నుండి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే ఈ విగ్రహాలన్నీ ఆలయ మెట్లకు సమీపంలోనే ఉన్నాయి. ఈ కళాఖండాలను బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌కు చెందిన కళాకారులు తయారు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..