హోటల్‌లో పీకలదాక మెక్కి.. రూ.10 వేల బిల్లు కట్టకుండా అమ్మాయిలు పరార్‌! ఊహించని ట్విస్ట్‌తో..

గుజరాత్ నుండి రాజస్థాన్‌కు ట్రిప్‌కు వెళ్ళిన ఐదుగురు అమ్మాయిలు రూ.10,900 రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టాలని ప్రయత్నించి దొరికిపోయారు. మౌంట్ అబు సమీపంలో 'హ్యాపీ డే హోటల్‌'లో తిన్న తర్వాత టాయ్‌లెట్ పేరు చెప్పి పారిపోబోయారు. అయితే, ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని రెస్టారెంట్ సిబ్బందికి, పోలీసులకు పట్టుబడ్డారు.

హోటల్‌లో పీకలదాక మెక్కి.. రూ.10 వేల బిల్లు కట్టకుండా అమ్మాయిలు పరార్‌! ఊహించని ట్విస్ట్‌తో..
Girls Escape Restaurant Bil

Updated on: Oct 28, 2025 | 10:38 PM

ఓ ఐదుగురు అమ్మాయిలు గుజరాత్‌ నుంచి రాజస్థాన్‌కు ట్రిప్‌కు వచ్చారు. మంచిగా అంతా తిరిగారు. ఆకలేస్తుందని ఓ పెద్ద రెస్టారెంట్‌కి వెళ్లారు. నచ్చిన ఐటమ్‌ ఆర్డర్‌ ఇచ్చి పీకలదాక మెక్కారు. మొత్తంగా రూ.10900 బిల్లు చేశారు. తిన్నాక బిల్లు కట్టకుండా కావాలనే ఎగ్గొట్టాలని ప్లాన్‌ వేశారు. బిల్లు కట్టకుండా ఐదుగురు కూడా అక్కడి నుంచి ఎస్కేప్‌ అయ్యరు. కానీ, విధి వారిని వదిలిపెట్టలేదు. విచిత్రమైన ట్విస్ట​్‌తో రెస్టారెంట్‌ వారికి దొరికిపోయారు. రాజస్థాన్ లోని మౌంట్ అబూ సమీపంలోని సియావాలోని హ్యాపీ డే హోటల్‌లో దిగారు ఐదుగురు అమ్మాయిలు. హ్యాపీగా అందరూ కలిసి మంచి రుచికరమైన, ఖరీదైన ఫుడ్‌ ఆర్డర్‌ చేశారు. బాగా ఆరగించారు.

మొత్తం బిల్లు రూ.10,900 బిల్లు అయింది. బిల్లు ఎగవేసే నెపంతో టాయ్‌లెట్‌ వంకతో ఒకరి తరువాత ఒకరు మెల్లిగా జారుకున్నారు. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి, కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో రెస్టారెంట్‌ సిబ్బంది వారిని పట్టుకున్నారు. దొరికిన తర్వాత కూడా రోడ్డుపై నానాహంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హోటల్‌లో వీరి వ్యవహారాన్ని ఒక కంట గమనిస్తున్న హోటల్ యజమాని వెయిటర్ వాళ్లను వెంబడించారు. గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు అంబాజీ వైపు కారు వెళ్తున్నట్లు CCTV ఫుటేజ్ లో కనిపించింది. పోలీసుల సహాయంతో ఐదుగురినీ అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తరువాత తమ స్నేహితుడికి ఫోన్ చేసి బిల్లు చెల్లించడానికి ఆన్‌లైన్‌లో డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయమని చెప్పి బిల్లు కట్టారట.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి