
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని మరోసారి నిరూపించింది. రైలు ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ, ఇక్కడ జరిగిన ఒక అరుదైన ఘటనలో రైల్వే సిబ్బంది చూపిన నిజాయితీ, కార్తవ్య దీక్ష ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రైలు టాయిలెట్‌లోని మురికి పైపులోకి జారిపోయిన ఒక మహిళ బంగారు ఉంగరాన్ని సిబ్బంది ఎంతో శ్రమించి వెలికితీసి వారికి తిరిగి అప్పగించారు. అసలేం జరిగిందంటే..
ఒక మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆమె చేతికున్న విలువైన బంగారు ఉంగరం ఊడి, నేరుగా టాయిలెట్ డ్రైనేజీ హోల్ గుండా కింద ఉన్న మురుగు పైపుల్లోకి వెళ్ళిపోయింది. ఎంతో సెంటిమెంట్, విలువైన ఆ ఉంగరం చేజారిపోవడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అధైర్యపడకుండా, ఆమె వెంటనే రైల్వే అధికారులకు తెలియజేసింది. హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా ఈ విషయంపై రైల్వేకు ఫిర్యాదు చేశారు.
కంట్రోల్ రూమ్ నుండి సమాచారం అందుకున్న మెకానికల్, క్లీనింగ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రైలు తదుపరి స్టేషన్‌లో ఆగడమే ఆలస్యం.. వారు వెంటనే రంగంలోకి దిగారు. టాయిలెట్ కింద ఉండే మురు, వ్యర్థాల పైపులను విప్పడం సాధారణంగా ఎంతో అసహ్యకరమైన, కష్టతరమైన పని. అయినప్పటికీ, రైల్వే సిబ్బంది ఏమాత్రం వెనుకాడకుండా టాయిలెట్ కింద ఉండే కెమికల్ ట్యాంక్, డ్రైనేజీ అవుట్‌లెట్ పైపులను విప్పి, ఆ మురికిలోనే ఉంగరం కోసం వెతకడం ప్రారంభించారు.
చివరకు వారి శ్రమ ఫలించింది. ఎంతో శ్రమించి ఆ మురుగు వ్యర్థాల నుండి బంగారు ఉంగరాన్ని సురక్షితంగా బయటకు తీశారు. దానిని శుభ్రం చేసి సదరు మహిళా ప్రయాణికురాలికి అప్పగించారు. తన ఉంగరం మళ్లీ దొరుకుతుందని ఊహించని ఆ మహిళ, రైల్వే సిబ్బందికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.
🚆 चलती ट्रेन के टॉयलेट में गिर गई लाखों की सोने की अंगूठी…
यात्री ने सोचा अब अंगूठी कभी वापस नहीं मिलेगी। 💍😢
गाड़ी संख्या 09037 बांद्रा टर्मिनस–भुज स्पेशल के कोच B-8 में सफर के दौरान अंगूठी सीधे वॉशरूम के ड्रेनेज पाइप और टैंक में गिर गई।
लेकिन अहमदाबाद स्टेशन पहुंचते ही… pic.twitter.com/Crj8TLIq0b
— DRM Ahmedabad (@drmadiwr) May 12, 2026
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నిమిషాల్లో వైరల్‌గా మారాయి. భారతీయ రైల్వే సిబ్బంది పనితీరు అమోఘం, మురికిని కూడా లెక్కచేయకుండా ప్రయాణికురాలి ఆవేదనను అర్థం చేసుకున్న సిబ్బందికి సెల్యూట్ అంటూ నెటిజన్లు సదరు రైల్వే ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రైల్వే శాఖ కూడా తమ సిబ్బంది సమయస్ఫూర్తిని, సేవా భావాన్ని అభినందించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..