గణపతి నిమజ్జనం వేళ అనంత్ అంబానీపై రాధిక దాడి..! అడ్డుకున్న సెక్యూరిటీ..అందమైన వీడియో వైరల్

అంబానీ కుటుంబంలో ఏ పండుగైన ఊరంతా సందడిగా జరుగుతాయి. ఈ క్రమంలోనే ముంబైలోని తమ ఇంటి యాంటిలియాలో గణపతి బప్పా వీడ్కోలు ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. వినాయక నిమజ్జన ర్యాలీలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి వాహనం వెనుక కొంతమంది అంబానీ కుటుంబ సభ్యులు నడుస్తుండగా, మరికొందరు గణపయ్యతో పాటు వాహనంలో వెళ్తున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గణపతి నిమజ్జనం వేళ అనంత్ అంబానీపై రాధిక దాడి..! అడ్డుకున్న సెక్యూరిటీ..అందమైన వీడియో వైరల్
Ganpati Visarjan

Updated on: Aug 29, 2025 | 7:09 PM

గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం వివిధ అందమైన క్షణాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిలో అత్యంత ఆకర్షణీయమైనది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ మధ్య జరిగిన ఒక సరదా సంఘటన ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవును.. అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన తారలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైరల్‌ వీడియోలో వినాయక నిమజ్జనం ఊరేగింపు వేడుకలో రాధిక గులాబి రంగు అనార్కలి డ్రెస్‌లో మెరిసిపోతున్నారు.. బంధానీ నమునా కుర్తా, గుండ్రని స్ప్లిట్‌ నెక్‌న్‌, క్వార్టర్‌లెంగ్త్‌ స్లీవ్‌లు, ఎంబ్రాయిడరీ టాసెల్స్‌తో ఆకర్షనీయంగా ఉండే డిజైనర్‌వేర్‌లో సింపుల్‌ లుక్‌లో కనిపించింది రాధిక. ఆ డ్రెస్‌కి తగ్గ బంగారు గాజులు, డైమండ్‌ ఇయర్‌ స్టడ్స్‌తో సాధారణ అమ్మాయిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ గణేశ్‌ నిమజ్జనం ఆచారాలన్నింటిని అనంత్‌ రాధికాలు కలిసి నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అనంత్, రాధిక దంపతుల మధ్య జరిగిన పూల యుద్ధం ఎంత ముద్దుగా ఉందో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీడియోలో, రాధిక ఒక వాహనంలో కూర్చుని, అంగరక్షకులతో వెనుక నడుస్తున్న అనంత్ అంబానీపై ప్రేమగా బంతి పువ్వును విసురుతోంది. అనంత్ కూడా అదే సంజ్ఞ చేసి ఆమెపై పూల రేకులను విసరడం ప్రారంభించాడు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, బాడీగార్డ్‌లు, వారిలో ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చాలా జాగ్రత్తగా, పువ్వులను ఆపి ఆ జంటకు మద్దతు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..