Srisailam Temple : ఆలయ ప్రాంగణంలో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన భక్తులు..

| Edited By: Rajeev Rayala

Feb 05, 2024 | 11:05 AM

శ్రీశైలంలోని చండీశ్వర సధన్ ఉద్యోగుల నివాసగృహాల వద్ద పెద్ద కొండ చిలువ రోడ్డు దాటుతూ భక్తుల కంటపడింది. చీకట్లో కొండచిలువను చూసి భయపడిన భక్తులు అక్కడ నివాసముండే ఆలయ సిబ్బందికి తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది స్నేక్‌ క్యాచర్‌ రాజాకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా కొండచిలువను బంధించాడు.

Srisailam Temple : ఆలయ ప్రాంగణంలో కొండచిలువ కలకలం.. పరుగులు పెట్టిన భక్తులు..
Srisailam Temple
Follow us on

శ్రీశైలం భ్రమరాంబికామల్లికార్జునస్వామివారి ఆలయ ప్రాంగణంలో కొండచిలువ కలకలం రేపింది. అర్ధరాత్రి కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది సమాచారంతో స్నేక్‌ క్యాచర్‌ వచ్చి కొండచిలువను బంధించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

శ్రీశైలంలోని చండీశ్వర సధన్ ఉద్యోగుల నివాసగృహాల వద్ద పెద్ద కొండ చిలువ రోడ్డు దాటుతూ భక్తుల కంటపడింది. చీకట్లో కొండచిలువను చూసి భయపడిన భక్తులు అక్కడ నివాసముండే ఆలయ సిబ్బందికి తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది స్నేక్‌ క్యాచర్‌ రాజాకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా కొండచిలువను బంధించాడు. అనంతరం దానిని తీసుకువెళ్లి సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. దాంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..