Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?

|

Mar 17, 2022 | 10:00 PM

Hidden Picture: చాలా మందికి పజిల్స్‌ను తెగ ఇష్టపడుతారు. పజిల్స్‌ను చేజ్ చేయడాన్ని ఆనందంగా, విజయంగా భావిస్తుంటారు. ఇలాంటి ఫజిల్స్, టాస్క్ చేజింగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి.

Puzzle Picture: ఈ ఫోటోలో ఒక వీరుడు దాగున్నాడు.. ఎక్కడ ఉన్నాడో కనిపెట్టగలరా?
Puzzle Picture
Follow us on

Hidden Picture: చాలా మందికి పజిల్స్‌ను తెగ ఇష్టపడుతారు. పజిల్స్‌ను చేజ్ చేయడాన్ని ఆనందంగా, విజయంగా భావిస్తుంటారు. ఇలాంటి ఫజిల్స్, టాస్క్ చేజింగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి. ప్రకృతిలో మనం ఒక భాగం.. మన కంటికి కనిపించని జీవులెన్నో ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాయి. అయితే, మన కళ్లకు కనిపించే జీవులు కూడా ప్రకృతి ఒడిలో సంచరిస్తుంటాయి. ఉదాహరణకు.. మనం అప్పటి వరకు వినియోగించిన గుండు సూది కింద పడిపోతే దానిని కనిపెట్టడానికి చాలాసేపు కష్టపడాల్సి వస్తుంది. అలాగే ప్రకృతితో మమేకైన జీవులను కూడా కనిపెట్టడం కొంచె కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రకృతి రంగులో.. జీవుల రంగు కూడా కలిసిపోవడం కారణం. అలాంటి దాగుడు మూతల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో ఉన్న జంతువులను కనిపెట్టాలంటూ టాస్క్‌లు కూడా రచ్చ చేస్తుంటాయి.

ఇదిలాఉంటే.. యుద్ధంలో పాల్గొనేవారు, ఆర్మీ గానీ, సైనికులు గానీ, పోలీసులు గానీ ప్రత్యర్థుల కళ్లు గప్పి, వారికి కనిపించకుండా ఉండేందుకు ప్రకృతిలో కలిసిపోయే దుస్తులు ధరిస్తుంటారు. అలా ముందుకు కదులుతూ ప్రత్యర్థులకు షాక్ ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు యుద్ధ క్షేత్రాల్లో చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ స్నప్పర్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకృతితో మమేకమై.. ప్రత్యర్థులతో పోరాడుతున్న ఆ వీరుడిని కనిపెట్టాలంటూ ఛాలెంజ్ విసిరారు. ఈ ఫోటోలో దాగిఉన్న సోల్జర్‌ను కనిపెట్టడానికి నెటిజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా మంది ఈ టాస్క్‌లో వెనుకబడిపోయారు. మరి మీరేమైనా ఆ యుద్ధ వీరుడు ఎక్కడున్నాడో కనిపెట్టి చెప్పగలరా? అయితే కింది ఫోటోపై ఓ లుక్కేసుకోండి.

 

Puzzle Pic

Also read:

Viral Video: దెయ్యమే ఆ పని చేసిందా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న షాకింగ్ వీడియో..!

Spinal Cord Surgery: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. బాలుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్స్..!

Summer Health Tips: వేపవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణుల సూచనలు మీకోసం..