Viral Video: నో పార్కింగ్ జోన్ లో బైక్ ఉందని పోలీసులు ఏం చేశారో చూస్తే షాకే!

|

Aug 20, 2021 | 6:30 PM

ఒక్కోసారి తప్పెవరిదైనా కొన్ని సంఘటనలు ప్రజల్లో విపరీతమైన కోపాన్ని తెప్పిస్తాయి. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

Viral Video: నో పార్కింగ్ జోన్ లో బైక్ ఉందని పోలీసులు ఏం చేశారో చూస్తే షాకే!
Bike With Rider
Follow us on

Viral Video: ఒక్కోసారి తప్పెవరిదైనా కొన్ని సంఘటనలు ప్రజల్లో విపరీతమైన కోపాన్ని తెప్పిస్తాయి. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అటువంటిదే ఈ సంఘటన కూడా. ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగంగా నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేసిన వాహనాలను తమ టొయింగ్ వాహనాలతో తీసుకుని పోవడం సర్వసాధారణ విషయం. ముఖ్యంగా నగరాల్లో ఇది తరుచు జరిగేదే. అయితే..ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలో పోలీసులు కాస్త అతి చేశారు. బైక్ మీద మనిషి ఉండగానే.. అతనితో సహా బ్యాక్ ను గాలిలో లేపి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. సంఘటన ఎక్కడ జరిగిందంటే..

పూణేలోని నానా పేథ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసిన బైక్‌ను రైడర్‌తో పాటు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వ్యక్తులు క్రేన్ తో లాగడం ద్వారా తీసుకెళ్లారు. గురువారం సాయంత్రంజరిగిన ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు శుక్రవారం వెలుగులోకి రావడంతో ట్రాఫిక్ విభాగం అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే, ట్రాఫిక్ విభాగం బైక్ ‘నో-పార్కింగ్’ జోన్‌లో పార్క్ చేశారనీ అంతేకాకుండా ఆ బైక్ రైడర్ ఉద్దేశపూర్వకంగా టోవింగ్ చేస్తున్నప్పుడు దానిపై కూర్చున్నారని చెప్పారు. కానీ, ఇది నమ్మశక్యంగా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ సంఘటన  చిత్రాలు సోషల్ మీడియాలో కనిపించడంతో, ప్రజలు ఇప్పుడు ట్రాఫిక్ విభాగం పని తీరుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో బైక్ రైడర్‌ను ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తీసుకెళ్లింది, ‘సార్, నా బైక్ నో-పార్కింగ్‌లో లేదు, నేను రోడ్డు పక్కన రెండు నిమిషాలు నిలబడ్డాను. నేను నా బైక్ పార్క్ చేయలేదు, నేను వెంటనే బయలుదేరుతున్నాను, దయచేసి నాపై చర్య తీసుకోకండి. అంటూ పోలీసులను ఎంత బ్రతిమాలినా సరే.. ట్రాఫిక్ విభాగం పోలీసులు వినలేదు. బైక్‌తో సహా ఆ వ్యక్తిని ఎత్తుకెళ్లారు.

ఈ సంఘటన వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, ఆ తప్పు ఆ యువకుడిదే అయినా, అతడిని బైక్‌తో ఈ విధంగా ఎత్తడం సరైనదేనా అని ప్రజలు ఇప్పుడు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అతను పడి ఉంటే ఎవరు బాధ్యులు అని వారు అడుగుతున్నారు? ఈ విషయం పై మరో రకమైన వాదన కూడా వినిపిస్తోంది. ఈ వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తి వాహనాన్ని తీసుకున్న వారు కూడా దురుసుగా ప్రవర్తించారు.

స్థానిక ప్రజలు కూడా ట్రాఫిక్ విభాగంతో కలత చెందుతున్నారు

ఈ సంఘటన జరిగినపుడు అక్కడే  ఉన్న ప్రత్యక్ష సాక్షి అభిజీత్ ధావాలే మాట్లాడుతూ, “నానాపేట్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సాధారణ పౌరులను వేధిస్తున్నారు. వారు మా దుకాణం ముందు కారును లేదా బైక్ ను ఇలా టొయింగ్ చేసి తీసుకువెళ్లడం సాధారణం. ఆ సమయంలో కొంత రుసుము ఇస్తే వదిలేస్తారు.” అంటూ ఆరోపించారు.

ఈ విషయంపై స్పందించిన ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డిసిపి శ్రీరామ్ మాట్లాడుతూ, ‘నానా పేథ్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలపై నివేదికను కోరాము. నివేదిక అందగానే దీనిపై చర్యలు తీసుకుంటాము. దీని విచారణలో ఎవరు దోషులుగా తేలినా.. కఠిన చర్యలు తీసుకుంటాము” అని వెల్లడించారు.

ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు..

 

 

 

Also Read: Good News: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా డీఏ పెంచుతూ ఉత్తర్వులు

మహా విషాదం.. మరణశాసనం రాసిన ఇనుప రాడ్లు.. గాల్లో కలిసిన 13 మంది ప్రాణాలు