సాధారణంగా చేపలు ఎలా పడతారు.. వలలు వేస్తారు.. లేదా గేలానికి ఎరను కట్టి చేపలు పడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేతి వేలితో ఈజీగా చేపలు పట్టేస్తున్నాడు. ఇందుకోసం అతను బొటనవేలుని ఉపయోగిస్తున్నాడు. చిన్న టెక్నిక్‌తో క్షణాల్లో కేజీ చేపను పట్టేశాడు. ట్విట్టర్ అకౌంట్‌లో జనవరి 8న ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో ఓ కుర్రాడు… ప్రశాంతంగా ఉన్న ఓ సెలయేరు దగ్గరకు వెళ్లాడు. నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఆ నీటిలో తన కుడిచేతిని పెట్టిన కుర్రాడు… బొటన వేలును అటూ ఇటూ కదుపుతూ ఉన్నాడు. అలా అతను కదిపిన 10 సెకండ్లలో ఓ చేప… అతని వేలును తిందామని వచ్చింది. అంతే… వెంటనే చేపను పట్టి నీటి లోంచీ పైకి తీసి చూపించాడు.
ఇలా ఎలా సాధ్యమైందనేగా మీ డౌటు… టెక్నిక్ అంతా అతని వేలిలోనే ఉంది. ఆ వేలును కదుపుతున్నప్పుడు అతను అస్సలు కదలకుండా అంటే స్టాచ్యూలాగా కూర్చున్నాడు. కనీసం చెయ్యి కూడా కదపలేదు. కేవలం నీటిలో బొటనవేలుని మాత్రం కదిలించాడు. ఆ కదులుతున్న వేలును చూసి… ఆ చేప ఏ పురుగో అనుకొని దగ్గరకు వచ్చి అతని వేలును పట్టుకుంది. వెంటనే చేపను పట్టి పైకి లేపేసాడు. ఈ వీడియోకి క్యాప్షన్‌లో “చేతితో చేపలు పట్టడంలో నేర్పరి” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ చేపను బాస్ ఫిష్ అంటారు. ఇవి మనుషుల్ని చూసి భయపడవు. పైగా ఇవి స్వచ్ఛమైన నీటిలోనే పెరుగుతాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇతను చేపలు పట్టే టెక్నిక్ బావుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Pro hand fishing ? pic.twitter.com/l1vKlr0cix
— Best Videos ?? (@CrazyFunnyVidzz) January 8, 2022