AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెవడండీ బాబూ.. వేలితో చేపలు పట్టేస్తున్నాడు.. క్రేజీ వీడియో మీకోసమే!

సాధారణంగా చేపలు ఎలా పడతారు.. వలలు వేస్తారు.. లేదా గేలానికి ఎరను కట్టి చేపలు పడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి...

Viral Video: వీడెవడండీ బాబూ.. వేలితో చేపలు పట్టేస్తున్నాడు.. క్రేజీ వీడియో మీకోసమే!
Fish
Ravi Kiran
|

Updated on: Jan 10, 2022 | 9:17 PM

Share

సాధారణంగా చేపలు ఎలా పడతారు.. వలలు వేస్తారు.. లేదా గేలానికి ఎరను కట్టి చేపలు పడతారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేతి వేలితో ఈజీగా చేపలు పట్టేస్తున్నాడు. ఇందుకోసం అతను బొటనవేలుని ఉపయోగిస్తున్నాడు. చిన్న టెక్నిక్‌తో క్షణాల్లో కేజీ చేపను పట్టేశాడు. ట్విట్టర్‌ అకౌంట్‌లో జనవరి 8న ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇందులో ఓ కుర్రాడు… ప్రశాంతంగా ఉన్న ఓ సెలయేరు దగ్గరకు వెళ్లాడు. నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తోంది. ఆ నీటిలో తన కుడిచేతిని పెట్టిన కుర్రాడు… బొటన వేలును అటూ ఇటూ కదుపుతూ ఉన్నాడు. అలా అతను కదిపిన 10 సెకండ్లలో ఓ చేప… అతని వేలును తిందామని వచ్చింది. అంతే… వెంటనే చేపను పట్టి నీటి లోంచీ పైకి తీసి చూపించాడు.

ఇలా ఎలా సాధ్యమైందనేగా మీ డౌటు… టెక్నిక్ అంతా అతని వేలిలోనే ఉంది. ఆ వేలును కదుపుతున్నప్పుడు అతను అస్సలు కదలకుండా అంటే స్టాచ్యూలాగా కూర్చున్నాడు. కనీసం చెయ్యి కూడా కదపలేదు. కేవలం నీటిలో బొటనవేలుని మాత్రం కదిలించాడు. ఆ కదులుతున్న వేలును చూసి… ఆ చేప ఏ పురుగో అనుకొని దగ్గరకు వచ్చి అతని వేలును పట్టుకుంది. వెంటనే చేపను పట్టి పైకి లేపేసాడు. ఈ వీడియోకి క్యాప్షన్‌లో “చేతితో చేపలు పట్టడంలో నేర్పరి” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ చేపను బాస్ ఫిష్ అంటారు. ఇవి మనుషుల్ని చూసి భయపడవు. పైగా ఇవి స్వచ్ఛమైన నీటిలోనే పెరుగుతాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఇతను చేపలు పట్టే టెక్నిక్‌ బావుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..