Viral: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన మట్టి కుండ.. లోపల కళ్లు చెదిరేలా..

పొలం దున్నుతుండగా.. పాత ఇళ్లను కూలుస్తుండగా.. నిధి, నిక్షేపాలు.. చరిత్ర తాలూకా ఆనవాళ్లు బయటపడిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. అయితే చారిత్రక విశేషాల కోసం ఆర్కియాలజీ వాళ్లు కూడా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతుంటారు. తాజాగా టర్కీలో....

Viral: తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన మట్టి కుండ.. లోపల కళ్లు చెదిరేలా..
Treasure (Representative image)
Follow us

|

Updated on: Aug 07, 2024 | 12:52 PM

పాత ఇళ్లు కూల్చివేస్తుండగా… ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా… కాలువలు, చెరువల కోసం పూడిక పనులు చేస్తుండగా.. పురాతన నిధి, నిక్షేపాలు, విగ్రహాలు దొరికిన ఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఎవరైన ఒక వ్యక్తి ఇలా నిధి దొరికితే మాత్రం వారు చప్పుడు కాకుండా తీసుకెళ్లి నిధిని దాచుకుంటారు. అలా నిధి బయటపడ్డ సమయంలో జనం ఉంటే మాత్రం… ఆ వార్త గుప్పుమని అధికారుల వద్దకు వెళ్తుంది. వెంటనే వారు రంగప్రవేశం చేసి ఆ నిధిని స్వాధీనం చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు పురావస్తు శాస్త్రవేత్తలు చారిత్రక ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూడా నిధులు దొరికిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా టర్కీలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పురాతన గ్రీకు నాణేలతో నిండిన కుండను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పశ్చిమ టర్కీలోని పురాతన గ్రీకు నగరమైన నోషన్‌లోని ఒక ఇంటి కింద ఈ నిధి కనుగొనబడింది. దొరికిన బంగారు నాణేలు పెర్షియన్ సామ్రాజ్యం ఉపయోగించే గోల్డ్ కాయిన్ పెర్షియన్ డారిక్ మాదిరిగా… మోకాలి విలుకాడు చిత్రాన్ని కలిగి ఉన్నాయి. గ్రీకు చరిత్రకారుడు జెనోఫోన్ ప్రకారం, ఒక సైనికుడి నెలవారీ జీతం ఒక్క డారిక్ విలువైనదిగా తెలిసింది. నోషన్‌కు ఈశాన్యంగా 60 మైళ్ల (97 కిలోమీటర్లు) దూరంలో ఉన్న సార్డిస్‌లో ఈ నాణేలు ముద్రించబడి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ నాణేలు.. కిరాయి సైనికులు చెల్లింపుగా ఉపయోగించారని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దానిని భూమి లోపల దాచడానికి గల కారణం మాత్రం అంతుబట్టడం లేదు. ” తవ్వకంలో ఇంత విలువైన నిధిని కనుగొనడం చాలా అరుదు” అని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్, నోషన్ ఆర్కియాలజికల్ సర్వే డైరెక్టర్ క్రిస్టోఫర్ రాట్టే అన్నారు. ఇంత.. అమూల్యమైన నాణేలను తిరిగి పొందాలనే ఉద్దేశ్యం లేకుండా ఎవరూ పాతిపెట్టరు. తీవ్రమైన దురదృష్టంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని ఆయన పేర్కొన్నారు. నాణేలు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందినవనిగా నిపుణులు చెబుతున్నారు.  (Source)

Gold Coins

Gold Coins

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..