Trending News: లంచంగా ఐదు కేజీల ఆలు గడ్డలు అడిగినందుకు పోలీస్ సస్పెన్షన్..

|

Aug 12, 2024 | 2:45 PM

లంచంగా ఐదు కేజీల బంగాళదుంపలు అడిగినందుకు ఓ ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ జోరుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ వార్త తెలిసిన జనం, నెటిజన్లు ఒకింత షాక్‌కి గురయ్యారు. సాధారణంగా కార్లు, డబ్బులు, బంగారం, స్థలాలు, ఫ్లాట్లు వంటివి లంచంగా తీసుకుని సస్పెన్షన్‌కి గురైన అధికారులు, పోలీసులు..

Trending News: లంచంగా ఐదు కేజీల ఆలు గడ్డలు అడిగినందుకు పోలీస్ సస్పెన్షన్..
Trending News
Follow us on

లంచంగా ఐదు కేజీల బంగాళదుంపలు అడిగినందుకు ఓ ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ జోరుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ వార్త తెలిసిన జనం, నెటిజన్లు ఒకింత షాక్‌కి గురయ్యారు. సాధారణంగా కార్లు, డబ్బులు, బంగారం, స్థలాలు, ఫ్లాట్లు వంటివి లంచంగా తీసుకుని సస్పెన్షన్‌కి గురైన అధికారులు, పోలీసులు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా ఐదు కేజీల బంగాళ దుంపల్ని కోడ్‌గా ఉపయోగించి లంచం అడగటం ఇప్పుడు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. లంచంగా ఆలు గడ్డలను డిమాండ్ చేసిన కారణంతో కన్నౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్‌ను పోలీసులు సస్పెండ్ చేశారు. ఆలు గడ్డలను లంచానికి కోడ్‌గా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. కన్సౌజ్‌లోని స్థానిక సారిఖ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని భావల్ పూర్ చపున్నా చౌకీలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న రామ్ కృపాల్ సింగ్ అనే పోలీసులు.. ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. కేసు సాల్వ్ చేస్తే.. తనకు 5 కేజీల బంగాళదుంపలు కావాలని అడిగాడు.

కానీ తను లంచంగా అడిగింది ఆలు గడ్డలు కాదని.. బాధితుడికి ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు పోలీసు. అక్కడున్నవారికి అది అర్థం కాకుండా ఉండటానికి బంగాళదుంపలు అని అడిగాడు. దీంతో బాధితుడు ఐదు కిలోలు ఇవ్వలేనని కేవలం రెండు కిలోలు మాత్రమే ఇస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఐ.. తన డిమాండ్‌ను తీర్చాల్సిందేనని హెచ్చరించాడు. ఇక మొత్తానికి 3 కిలోలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే అక్కడున్న వారు ఎవరో ఎస్‌ఐ మాటలను రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. ఎస్ఐ రామ్ కృపాల్ సింగ్‌ని సస్పెన్షన్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.