Trending: మద్యం షాపు గోడకు కన్నం.. లోపల చూసిన దృశ్యాలు చూసి మైండ్ బ్లాంక్

|

Sep 04, 2022 | 1:56 PM

తమిళనాడలో (Tamil Nadu) ఘరానా చోరీ వెలుగులోకి వచ్చింది. తిరువళ్లూరులో మందుబాబులు చేసిన ఈ దొంగతనం గురించి తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. మూసి ఉన్న వైన్ షాపు గోడకు కన్నం...

Trending: మద్యం షాపు గోడకు కన్నం.. లోపల చూసిన దృశ్యాలు చూసి మైండ్ బ్లాంక్
Wine Shop Theft
Follow us on

తమిళనాడలో (Tamil Nadu) ఘరానా చోరీ వెలుగులోకి వచ్చింది. తిరువళ్లూరులో మందుబాబులు చేసిన ఈ దొంగతనం గురించి తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. మూసి ఉన్న వైన్ షాపు గోడకు కన్నం వేసి లోపలకు చొరబడ్డా యువకులు వింత చర్యకు పాల్పడ్డారు. అసలే మద్యం షాపులో చోరీ (Theft).. కళ్ల ముందు మద్యం బాటిళ్లు.. ఇంకే ముంది వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడే దుకాణం పెట్టేశారు. ఎంతగా అంటే తిరిగి వెళ్లాలనే స్పృహ కూడా లేనంతగా.. రాత్రి నుంచి మొదలుపెడితే ఉదయం వరకు తాగుతూనే ఉన్నారు. అందరూ కూర్చొని చీర్స్ చెప్పుకుంటూ, గ్లాసుల్లో మందు పోసుకుంటూ ఆనందంలో తేలిపోయారు. సరదా కబుర్లు చెప్పుకుంటూ గుటుక్కుమనించారు. అర్థరాత్రి గోడకు రంధ్రం చేసిన విషయం తెలుసుకున్న షాపు యజమాని పోలీసులకు కంప్లైంట్ చేశారు.

అతని ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు షాపును పరిశీలిస్తుండగా గోడకు కన్నం కనిపించింది. ఆ కన్నం ద్వారా లోపలికి వెళ్లి చూడగా వారికి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. రాత్రి సమయంలో దొంగతనానికి వచ్చిన యువకులు అక్కడే మద్యం తాగుతూ ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని అదే రంధ్రం ద్వారా బయటకు తీసుకువచ్చారు. బయటకు వచ్చాక వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి