Viral Video: ఫ్రెండ్‌షిప్‌ అంటే ఈ పావురం, కుక్కదే..! వీడియో చూస్తే మీరూ అదే ఫీలవుతారు..

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. మనుషుల మాదిరిగానే జంతువులకు

Viral Video: ఫ్రెండ్‌షిప్‌ అంటే ఈ పావురం, కుక్కదే..! వీడియో చూస్తే మీరూ అదే ఫీలవుతారు..
Pigeon Dog

Updated on: Sep 17, 2021 | 7:22 PM

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా అది రుజువవుతుంటుంది. తాజాగా కుక్క, పావురం స్నేహంగా ఉన్న ఓ వీడియో ఇంటర్‌ నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కుక్క, పావురం కలిసి ఒకే దగ్గర నిద్రించడం మనం చూడవచ్చు.

వీడియోలో ఓ కుక్క మంచం మీద పడుకుని ఉంటుంది. పక్కనే ఒక పావురం ఉండటం మనం గమనించవచ్చు. ఇందులో విషయం ఏంటంటే పావురం కుక్క పాదాలను తాకుతూ డిస్ట్రబ్‌ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కుక్క పావురాన్ని ఏమి అనదు. అయితే వీడియో చూసిన నెటిజన్లు అవి రెండు మంచి స్నేహితులు అందుకే కుక్క పావురాన్ని ఏమి అనడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు వినియోగదారులు ఈ వీడియోను పదే పదే చూస్తూ నవ్వుకుంటున్నారు. స్నేహమంటే ఇదేరా అంటూ క్యాప్షన్ పెడుతున్నారు.

ఈ వీడియోను IFS అధికారి సుశాంత నందా సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో మాదిరే గతంలో కూడా చాలా వీడియోలు వచ్చాయి. అయితే మనుషుల్లాగే జంతువులు కూడా అన్నీ అర్థం చేసుకుంటాయి. వాటికి ఆపద తలపెట్టనంతవరకు ఎవరిని ఏమి అనవు. ఆత్మరక్షణ కోసం మాత్రమే అవి తిరగబడుతాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులు ఇంట్లో సభ్యుడిలా ఉంటాయి. మనుషులలాగే అన్ని అర్థం చేసుకుంటాయి.

NIA: షరియా లక్ష్యం.. ఆన్‌లైన్ ద్వారా భావజాల వ్యాప్తి. ఇస్లామిక్ స్టేట్ వ్యాప్తిపై NIA కీలక ప్రకటన

Sonam Kapoor: పెళ్లి తర్వాత కూడా అదే జోరు.. సోనమ్ కపూర్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Team India T20: టీ20 వైస్ కెప్టెన్సీ రేసులో ఇద్దరు ఆటగాళ్లు? అనూహ్యంగా తెరమీదకు మరో ఆటగాడి పేరు