ప్రజల హృదయాలను గెలుచుకోవడం, శత్రువుపై విజయం సాధించడం విషయంలో భారత సైన్యం ముందు అందరూ విఫలమే..ఇలాంటి పోస్ట్‌లు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఆర్మీ సిబ్బంది కఠినమైన శీతాకాలంలో ఎలా వర్కౌట్ చేస్తుంటారు.ఎక్కడో మంచు ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నారో కనిపిస్తుంది. ఈ చిత్రాలు, వీడియోలను చూసినప్పుడు, మనం ఉద్వేగానికి లోనవుతాం, వారిని చూసి స్పూర్తిని పొందుతాం..అలాంటిదే ఇక్క ఓ ఆర్మీ అధికారికి సంబంధించి మరో ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి మీరు కూడా ఇండియన్ ఆర్మీ సైనికులకు సెల్యూట్ చేస్తారు.
ఈ ఫోటోను హోంమంత్రి హర్ష్‌షాంఘ్వీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్ ఏమిటంటే, ఫోటోతో పాటు “భావోద్వేగాలు, కర్తవ్యం ఒకదానికొకటి కలిసినప్పుడు. హ్యాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ.” అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో ఓ ఆర్మీ అధికారి చిన్న పిల్లాడిని ఒడిలో పెట్టుకుని అంబులెన్స్‌లోని సీటులో కూర్చొన్నాడు. ఆ శిశువుకు ఏదైనా తినిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరొక అధికారి చేతిలో గుడ్డతో అతని పక్కన నిలబడి ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హృదయాన్ని కదిలించే ఈ చిత్రాన్ని చూసిన ప్రజలు ఈ జవాన్‌కు తల వంచి సెల్యూట్ చేస్తున్నారు. భారతీయ సైనికులను చూసి గర్విస్తున్నానంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హుమారా, మన దేశ సైనికుడికి సెల్యూట్’ అంటూ వినియోగదారు రాశారు.
When emotions and duty go hand in hand.
Hats off Indian Army? pic.twitter.com/irDgdzfkf5
— Harsh Sanghavi (@sanghaviharsh) June 8, 2022
అయితే, అలసు విషయం ఏంటంటే..గుజరాత్‌లో ఓ బోర్‌వెల్‌లో పడిపోయిన 18 నెలల బిడ్డను చాకచక్యంగా రక్షించడమే కాదు.. ఆ శిశువు పట్ట ఆర్మీ సిబ్బంది ఎంతో ప్రేమగా వ్యవహరించారు. దీనిని నిరూపిస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాబును ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆర్మీ అధికారులు ఎంత బాధ్యతగా వ్యవహరించారో.. ఆ శిశువును ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారో ఆ ఫోటో ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఆర్మీ సైనికులకు హ్యాట్సాప్ చెబుతున్నారు. మరీ ఈ ఫోటోపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి