సైన్స్, మనిషి పురోగతి ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ.. సముద్రపు లోతుల్లో ఇప్పటికీ మనిషికి చిక్కుముడిలా అనిపించే అనేక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పొచ్చు. సముద్రపుటడుగులో ఎన్నో రకాల విషపూరిత జంతువులు ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఒడ్డుకు రావు. వాటి నివాసం ఆ సముద్రపు లోతులే. వైరల్ వీడియో ప్రకారం.. కొందరు వ్యక్తులు ఓ సరస్సులాంటి దానిలో బోటింగ్ చేస్తుండగా.. ఓ విచిత్రమైన ఆకారం నీటి అడుగున కనిపిస్తుంది. అది చూడటానికి అచ్చం అరటిపండ్లు మాదిరిగా ఉంటాయి. కానీ దగ్గరకు వెళ్లి తీక్షణంగా చూస్తే.. నీటిలో నివసించే క్షీరదాలు.. సీల్స్‌లా ఉన్నాయని గ్రహించారు. ఇక వాటి మధ్య ఓ ఆస్థిపంజరంలా కనిపించే ఆకారం.. ఎప్పటి నుంచో అది నీటిలో ఉందని అనిపిస్తుంది. కాగా, ఈ వీడియోను ‘mustseeflorida’ అనే ఇన్‌స్టా ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.