
ప్రజంట్ సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్స్ సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగింది. వారికి ఆదాయం కూడా మాములుగా లేదు. అలానే యూట్యూబ్ వ్లాగర్స్ కూడా కొత్త కొత్త విషయాలపై ఫోకస్ చేస్తూ జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి చాలా మంది యూట్యూబ్‌ను మంచి ప్లాట్‌ఫారమ్‌గా పరిగణిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా మొబైల్ ఫోన్ లేదా కెమెరాను తీసుకెళ్లి యూట్యూబ్‌లో వ్లాగ్ చేసి షేర్ చేస్తున్నారు. అదే పని చేస్తూ తాజాగా ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు, అతను వ్లాగ్ చేయడానికి ఒక మారుమూల గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో తన సామాగ్రితో కూడిన బరువైన బ్యాగ్‌ను అతను వీపుపై ధరించాడు. దీంతో గ్రామస్థులు అతడ్ని ఉగ్రవాది అనుకుని భయపడి పోలీసులకు కాల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సూరజ్ శర్మ అనే వ్లాగర్ ఒక గ్రామాన్ని సందర్శించాడు, ఆ సందర్భంలో, అతని వీపుపై బరువైన బ్యాగ్ కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు, అతను ఉగ్రవాది కావచ్చునని భయపడి, బ్యాగ్ తెరవమని అడిగారు. అతను నిరాకరించడంతో, స్థానికులు అతడిని ఉగ్రవాదిగా అనుమానించి పోలీసులను పిలిచారు.
వీడియో దిగువన చూడండి…
Vlogger confused as atankwadi in Village pic.twitter.com/giACdgZOob
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 7, 2024
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో, గ్రామస్థులకు, వ్లాగర్‌కు మధ్య మాటల వాగ్వాదం కనిపిస్తుంది. వ్లాగర్‌ను ఉగ్రవాదిగా తప్పుగా భావించిన గ్రామస్తులు బ్యాగ్ తెరవమని అడిగారు. బ్యాగులోని వస్తువులను బయటకు తీస్తే.. లోపల పెట్టడానికి చాలా టై పడుతుందని, మీకు అవసరమైతే, పోలీసులను పిలవవచ్చని వ్లాగర్ రిప్లై ఇచ్చాడు. అతను తన యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా వారికి చూపించాడు. అయినా సరే అతడ్ని నమ్మని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెప్టెంబర్ 7న షేర్ చేయబడిన ఈ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్, కామెంట్స్ వచ్చాయి. ‘వారు అడగ్గానే ఓపెన్ చేసి చూస్తే ఇంత సినిమా ఉండేది కాద’ని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ‘నీకు మంచి కంటెంట్ దొరికింది భయ్యా.. అందుకే వారు ఎంత అడిగినా బ్యాగు ఓపెన్ చేయలేదు’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..