
నెమలి కేవలం ఒక జీవి మాత్రమే కాదు..అందరినీ మంత్రముగ్ధులను చేసే అందమైన పక్షి. దాని అందంతో అందరినీ కట్టిపడేస్తుంది. ఈ నీలి పక్షి తన రెక్కలను విస్తరించి నాట్యం చేస్తున్నప్పుడు.. అది ప్రకృతి అద్భుతం అని చెప్పాల్సిందే. అటువంటి అందమైన, అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక నెమలి యోగా చేస్తున్న మహిళ ముందు అకస్మాత్తుగా వచ్చి వాలింది. అంతేకాదు.. ఆమె ఎదురుగా ఆ నెమలి పురివిప్పి తిరుగుతూ అందంగా ఆడసాగింది.. ఈ అద్భుతమైన దృశ్యం అందరినీ ఆకర్షిస్తుంది. వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వీడియోలో ఒక విదేశీ మహిళ పైకప్పుపై యోగా చేస్తుంది. ఆమె ప్రశాంతమైన భంగిమలో కూర్చుని ఉంది. అంతలోనే ఎక్కడి నుంచో హాఠాత్తుగా ఒక నెమలి ఆమె ముందు దూకింది. ఆ తరువాత ఆ నెమలి మహిళ ముందు రెక్కలు విప్పుకుని నాట్యం చేస్తుంది. ఇందంతా ఎదురుగా ఉన్నవారు తమ సెల్‌ఫోణ్ కెమెరాలో రికార్డ్ చేశారు. అనంతరం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడా వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ ప్రకృతి దృశ్యాన్ని చూసిన కొందరు ఈ వీడియో AI అని అనుమానించారు. కాబట్టి, ఆ మహిళ ఎటువంటి సంగీతం లేకుండా మళ్ళీ పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించింది. ఈ వీడియోను @modernyogini.om అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, వీడియో చూసిన ఒక యూజర్ ‘ఎంత అందమైన నెమలి’ అని రాశారు. మరొక యూజర్ ‘అది మీకు మీ కవచంగా నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది’ అని అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..