Passengers push Airplane: సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విమానాన్ని రన్‌వేపై నుంచి నెడుతున్న వింత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. విమానాన్ని నెట్టడం ఎంటంటూ అవాక్కవుతున్నారు. ఈ వింత ఘటన బుధవారం నేపాల్‌లోని ఓ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. తారా ఎయిర్ సంస్థకు చెందిన విమానాన్ని ప్రయాణికులు నెడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. నేపాల్ వార్తల ప్రకారం.. కోల్టీలోని బజురా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం వెనుక టైర్ పేలింది. దీని కారణంగా విమానం రన్‌వే నుంచి టేకాఫ్ కాలేదు. ఇంతలో.. విమానం అడ్డుగా ఉండటంతో మరో విమానం పైకి ఎగరలేకపోయింది. దీంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు, భద్రతా సిబ్బందితో కలిసి విమానాన్ని రన్‌వే నుంచి క్లియర్ చేశారు. దీంతో ఇతర విమానాల రాకపోకలు జరిగినట్లు పేర్కొంటున్నారు.
ఈ వీడియోలో.. దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది విమానాన్ని రన్‌వేపై నుంచి పక్కకు నెట్టడాన్ని చూడవచ్చు. అయితే.. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది నేపాల్ లో మాత్రమే నంటూ వ్యంగంగా కామెంట్ చేశారు. కాగా.. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
వీడియో చూడండి:
सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw
— Samrat (@PLA_samrat) December 1, 2021
Also Read: